- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లాంచర్ తయారీ నేర్చుకొని ఒక్కొక్కరి పని చెప్పుద్దాం.. సిరాజ్ - సమీర్ ల చాటింగ్..
హైదరాబాద్ తో పాటు పలు ప్రాంతాల్లో బాంబు పేలుళ్ల కుట్ర కు ప్లాన్ చేసిన కేసులో నిందితుడు సిరాజ్ అరెస్టైనప్పుడు ఇచ్చిన వాంగ్మూలం సంచలనం రేపుతోంది.

దిశ, సిటీక్రైం : హైదరాబాద్ తో పాటు పలు ప్రాంతాల్లో బాంబు పేలుళ్ల కుట్ర కు ప్లాన్ చేసిన కేసులో నిందితుడు సిరాజ్ అరెస్టైనప్పుడు ఇచ్చిన వాంగ్మూలం సంచలనం రేపుతోంది. ఆ బాంబుల తయారీకి సంబంధించి నగదును హైదరాబాద్ కు చెందిన వ్యక్తి అందించిన వ్యవహారం కలకలం రేపుతోంది. బీహార్ కు చెందిన వ్యక్తి ఇచ్చిన ఆదేశాల మేరకే పేలుళ్ల కుట్రకు ప్లాన్ చేశామని సిరాజ్ చెప్పాడు. దేశ వ్యాప్తంగా మతోన్మాదం రెచ్చగొట్టి గొడవలు రేపడం విధ్వంసక చర్యలకు పాల్పడాలనే లక్ష్యంతోనే తాను యువతను రెచ్చగొట్టేందుకు అల్ హింద్ ఇత్తేహాదుల్ ముస్తీమీన్ ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నాడు. దీని కోసం దేశ వ్యాప్తంగా ఓ వర్గానికి సంబంధించిన యువతను కలిసేందుకు ప్రోగ్రామ్ ను రూపొందించుకున్నట్లు వెల్లడించాడు.
ఈ నెల 16న అరెస్టైన సిరాజ్ ఉర్ రెహ్మాన్ తన వాంగ్మూలంలో వెల్లడించిన కీలక విషయాలు ఇలా....ఓ వర్గం పై జరుగుతున్న దాడులు, మహిళలను మోసగించడం, హింస కు సంబంధించిన వీడియోలు చూసి, కొంత మంది ప్రసంగాలను విని తాను మతోన్మాదిగా మారిపోయానని చెప్పాడు. దీంతో ఎస్ఐ పరీక్షలు రాసేందుకు హైదరాబాద్ లో కోచింగ్ తీసుకుంటున్నప్పుడు సికింద్రాబాద్ బోయిగూడకు చెందిన సమీర్ పరిచయమయ్యాడు. అలా ఇద్దరీ ఆలోచనలు సరిపోవడంతో తాము ఏలాగైనా మతోన్మాదం రేపి ఇతర వర్గాల పై దాడులు చేయాలని నిర్ణయించుకున్నామని తెలిపాడు.
దీని కోసం సౌదీలో ఉంటున్న బీహార్ కు చెందిన అబుతాళేం అలియాస్ అబు ముసాద్ ఆదేశాలను సారంగా పని చేయాలని నిర్ణయించుకున్నామని, అతని చెప్పిన విధంగా తక్కువ ఖర్చుతో బాంబులను తయారు చేసేందుకు ప్రణాళికను రూపొందించుకున్నామని, ఈ పేలుడు పదార్ధాలను కొనుగొలుకు ఒమన్ దేశంలో ఉంటున్న హైదరాబాద్ కు చెందిన ఇమ్రాన్ అక్రమ్ 3 వేల రూపాయాలను పంపించాడని వారు తెలిపారు. ఆ డబ్బును సమీర్ కు పంపినట్లు సిరాజ్ వివరించాడు. ఇలా వచ్చిన డబ్బులతో అమ్మోనియం నైట్రేట్, సల్ఫర్ , అల్యూమినియం పౌడర్ ను కొనుగొలు చేసినట్లు తెలిపాడు. అంతే కాకుండా ఢిల్లీ, ముంబాయి, ఇంకా కొన్ని ప్రాంతాలకు వెళ్ళి మతోన్మాదానికి సంబంధించిన చర్చల్లో పాల్గొన్నట్లు చెప్పాడు. లాంచర్ తయారీ నేర్చుకుంటే మన వర్గం వారి జోలికి వచ్చే బుల్‌డోజర్, జేసీబీ లను టార్గెట్ చేయొచ్చని సమీర్ తో సిగ్నల్ యాప్ లో చాటింగ్ చేసినట్లు చెప్పాడు.
హెయిర్ ప్లాంటేషన్ కోసం మండోలి నుంచి మందు కూడా తీసుకువచ్చినట్లు సిరాజ్ బయటపెట్టాడు. ఈ వాంగ్మూలం నమోదు చేసుకున్న పోలీసులు సిరాజ్ చెప్పిన అంశాల పై ఆధారాలు సేకరించేందుకు ఏపీ పోలీసులు సిరాజ్, సమీర్ ల ను కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే. కస్టడీలో మరికొన్ని కీలక అంశాలు పోలీసులు సేకరించనున్నారు. పోలీసులు అప్రమత్తంతో ఈ పేలుళ్ల కుట్ర భగ్నం కావడంతో అల్ హింద్ ఇత్తేహాదుల్ ముస్లిమీన్ నెట్ వర్క్ ఇప్పుడు పోలీసులు చేతుల్లోకి రావడంతో ఈ సంస్థతో సంబంధం ఉన్న వారందరీ పై పోలీసు నిఘా పెరిగింది. వారి కార్యకలాపాలకు పోలీసుల దృష్టి తో బ్రేక్ పడింది.






