తెలంగాణ హైకోర్టులో SIR హెల్ప్ డెస్క్ ప్రారంభం

by Ramesh Naini |

ఎన్నికల ప్రక్రియను మరింత సులభతరం చేయడం, ఓటర్లకు మెరుగైన సేవలు అందించేందుకు, కమిషనర్/డీఈఓ ఆర్వీ. కర్ణన్ సూచనల మేరకు ఆయా సంస్థల్లో వద్ద హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

తెలంగాణ హైకోర్టులో SIR హెల్ప్ డెస్క్ ప్రారంభం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎన్నికల ప్రక్రియను మరింత సులభతరం చేయడం, ఓటర్లకు మెరుగైన సేవలు అందించేందుకు, కమిషనర్/డీఈఓ ఆర్వీ. కర్ణన్ సూచనల మేరకు ఆయా సంస్థల్లో వద్ద హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తెలంగాణ హైకోర్టులో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమం కింద 2002–2025 ఓటర్ల మ్యాపింగ్ కోసం అదనపు కమిషనర్ (ఎలక్షన్స్) కె. చంద్రకళ, డీసీ/ఈఆర్ఓ చార్మినార్ సరిత ఆధ్వర్యంలో ప్రత్యేక హెల్ప్ డెస్క్‌ను ప్రారంభించారు.

ఈ హెల్ప్ డెస్క్ ద్వారా న్యాయవాదులు తమ ఓటు వివరాలను సులభంగా మ్యాపింగ్ చేసుకునే అవకాశాన్ని వినియోగించుకున్నారు. హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్. సురేందర్ రెడ్డి, ఇతర సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని, ఎస్ఐఆర్ మ్యాపింగ్ కార్యక్రమానికి సహకారం అందించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ భవనాలు /ఆఫీసులు, ఉద్యోగి సంఘాలు, కమ్యూనిటీ డెవలప్‌మెంట్ సెంటర్లు తదితర సంస్థల్లో కూడా ఇలాంటి హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది.

Next Story