- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఓఎల్ఎక్స్ లో ఐ-ఫోన్ ప్రకటనలే టార్గెట్...
ఓఎల్ ఎక్స్ లో ఐ-ఫోన్ లను అమ్మకానికి పెట్టే వినియోగ దారులను టార్గెట్ చేసుకుని మోసాలకు పాల్పడుతున్న ఓ సిమ్ ప్రమోటర్ ను హైదరాబాద్ వెస్ట్ జోన్ సైబర్ జోనల్ టీమ్ , బంజారాహిల్స్ పోలీసులు కలిసి పట్టుకున్నారు.

దిశ, సిటీక్రైం : ఓఎల్ ఎక్స్ లో ఐ-ఫోన్ లను అమ్మకానికి పెట్టే వినియోగ దారులను టార్గెట్ చేసుకుని మోసాలకు పాల్పడుతున్న ఓ సిమ్ ప్రమోటర్ ను హైదరాబాద్ వెస్ట్ జోన్ సైబర్ జోనల్ టీమ్ , బంజారాహిల్స్ పోలీసులు కలిసి పట్టుకున్నారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం...ఆంధ్రప్రదేశ్ తాడేపల్లిగూడెం ప్రాంతానికి చెందిన మునావర్ భాష సిమ్ కార్టులను ప్రమోట్ చేసే ఉద్యోగంలో ఉన్నాడు. మునావర్ భాష మరికొందరు సైబర్ నేరగాళ్లతో కలిసి ఓఎల్ ఎక్స్ లో ఐ-ఫోన్ లను అమ్మకానికి సంబంధించిన ప్రకటనలను ఇచ్చే వారిని టార్గెట్ చేస్తాడు.
ఆ ప్రకటనను తిరిగి అతను రీ పోస్టు చేస్తాడు. అలా ఎవరైన స్పందించగానే ఐ-ఫోన్ ను విక్రయించే యజమానితో పాటు నిజంగా కొనుగొలు చేయడానికి ఆసక్తి చూపే వారిని మునావర్ భాష మాట్లాడి ఆ ఇద్దర్నీ ఒక దగ్గరకు చేరుస్తారు. ఆ తర్వాత కొనడానికి వచ్చిన వ్యక్తి మా బంధువు అవుతాడని, అమ్ముతున్న వ్యక్తి మాకు తెలిసిన వారని మాయ మాటలతో ఇద్దర్నీ నమ్మిస్తారు. అనంతరం ధరను డిసైడ్ చేసి డబ్బులను వారి ఖాతాల్లోకి వేయించుకుంటారు. అనంతరం ఫోన్ లు స్విచ్ ఆఫ్ చేసేస్తారు. ఇలా మునావర్ భాష 14 మందిని మోసం చేసిన కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని పోలీసుల విచారణలో తేలింది. బంజారాహిల్స్ పోలీసులు అతనిని అరెస్టు చేశారు. సిమ్ ప్రమోటర్ కావడంతో అతనికి ఇచ్చిన డెమో కార్డులను ఈ మోసానికి వాడినట్లు పోలీసులు గుర్తించారు.






