- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్ లో టాలీవుడ్ హీరోయిన్ సందడి
కొండాపూర్ లోని శరత్ సిటీ మాల్ లో టైటాన్ ఆర్ధ్ హ్యాండ్ బ్యాగ్ ల ప్రీమియం శ్రేణిని గురువారం శ్రియా శరణ్ ప్రారంభించారు.

దిశ, శేరిలింగంపల్లి : టైటాన్ సంస్థకు చెందిన ప్రీమియం హ్యాండ్ బ్యాగ్ బ్రాండ్ అయిన అర్థ్ హైదరాబాద్ లో తమ మొట్టమొదటి ప్రత్యేకమైన బ్రాండ్ స్టోర్ ను ప్రారంభించింది. కొండాపూర్ లోని శరత్ సిటీ మాల్ లో టైటాన్ ఆర్ధ్ హ్యాండ్ బ్యాగ్ ల ప్రీమియం శ్రేణిని గురువారం ప్రముఖ నటి శ్రియా శరణ్ ప్రారంభించారు. ఈ సందర్బంగా షోరూంలో ఏర్పాటు చేసిన నూతన బాగ్స్, వాలెట్స్, ఇతర వస్తువుల గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా నటి శ్రియా శరణ్ మాట్లాడుతూ.. తనకు బాగ్స్ చాలా ఇష్టమని, ఎక్కడకు వెళ్లినా బ్యాగ్ నిండా షాపింగ్ చేస్తనన్నారు. లేటెస్ట్ వైబ్రేంట్ బాగ్స్ కూడా చాలా ఇష్టమని తెలిపారు. అర్థ్ స్టోర్ లో చాలా రకాల బాగ్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. తాను ఎక్కడకు వెళ్లినా తన పాప కోసం బ్యాగ్స్ తీసుకుంటానని అన్నారు. అదే విధంగా తనకు హైదరాబాద్ అంటే అపారమైన ప్రేమ అని, ఇక్కడ ఉంటే తన సొంత ఊరులో ఉన్న ఫీల్ వస్తుందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ మధ్య విడుదల అయిన సినిమా మంచి హిట్ అయిందని, త్వరలో తెలుగు ఫాన్స్ కోసం మరిన్ని సినిమాలలో నటిస్తానని తెలిపారు.






