- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మందుబాబులకు షాకింగ్ న్యూస్.. రాచకొండ పోలీస్ కమిషనరేట్ కీలక ఉత్తర్వులు
జంట నగరాల పరిధిలోని మందుబాబులకు పోలీసులు షాకిచ్చారు.

దిశ, వెబ్‌డెస్క్: జంట నగరాల పరిధిలోని మందుబాబులకు పోలీసులు షాకిచ్చారు. రేపు శ్రీరామ నవమి (Srirama Navami) పర్వదినం సదర్భంగా హైదరాబాద్ (Hyderabad), సికింద్రాబాద్ (Secunderabad) పరిధిలోని మొత్తం వైన్ షాపులు (Wine Shops) మూతపడున్నాయి. ఈ మేరకు ఏప్రిల్ 6న వైన్ షాపులు బంద్ చేయాలంటూ రాచకొండ పోలీస్ కమిషనరేట్ (Rachakonda Police Commissionerate) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పరిణామంతో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం దుకాణాలు మూతపడనున్నట్లుగా పేర్కొన్నారు.
అదేవిధంగా నగర పరిధిలోని వైన్ షాపులతో పాటు కల్లు కాపౌండ్లు, బార్లు, రెస్టారెంట్లు, స్టార్ హోటళ్లు (Star Hotels) కూడా క్లోజ్ చేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. శ్రీరామ నవమి (Srirama Navami) సందర్భంగా నగరంలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలుగకుండా వైన్ షాపుల మూసివేతకు నిర్ణయం తీసుకున్నామని రాచకొండ పోలీసు ఉన్నతాధికారులు వెల్లడిచారు. ఒకవేళ పోలీసుల ఆదేశాలను బేఖాతురు చేసి షాపులు తెరిస్తే సదరు యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలోనే రేపు వైన్ షాపులు బంద్ అవ్వనున్న నేపథ్యంలో లిక్కర్ ప్రియులు ఇవాళ షాపుల ఎదుట మందు కొనుగోలు చేసేందుకు క్యూ కడుతున్నారు.






