బోనాలలో మహిళలపై వేధింపులు.. 644 మందిని అదుపులోకి తీసుకున్న షీ టీమ్స్

by Muthe.Rajitha |

మహిళలపై వేధింపుల(Harassment of women)కు పాల్పడిన వారిపై మరోసారి షీ టీం పోలీసులు(She Team's) కొరడా ఝులిపించారు.

బోనాలలో మహిళలపై వేధింపులు.. 644 మందిని అదుపులోకి తీసుకున్న షీ టీమ్స్
X

దిశ, వెబ్ డెస్క్ : మహిళలపై వేధింపుల(Harassment of women)కు పాల్పడిన వారిపై మరోసారి షీ టీం పోలీసులు(She Team's) కొరడా ఝులిపించారు. హైదరాబాద్ లో ఇటీవల జరిగిన బోనాల(Bonalu) పండుగలో లక్షలాది మంది పాల్గొన్నారు. గోల్కొండ అమ్మవారు, సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారు, లాల్ దర్వాజ సింహవాహిని, బల్కంపేట ఎల్లమ్మ వంటి పలు ప్రముఖ దేవాలయాల్లో బోనాల పండుగ రోజు ఇసుక వేస్తె రాలనంత మంది ఉత్సవాలకు హాజరయ్యారు. అయితే ఇదే అదనుగా భావించి, కొందరు ఆకతాయిలు మహిళలను వేధించారు. వారిని అసభ్యంగా తాకుతూ వికృత చేష్టలకు పాల్పడ్డారు. అయితే ఇలాంటి ఆకతాయిలు ఉంటారని ముందు జాగ్రత్తగా ఎక్కడికక్కడ షీ టీమ్స్ పోలీసులు మఫ్టీలో మాటు వేసి వీరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

ఇలా గత నాలుగు వారాలుగా వివిధ దేవాలయాల్లో జరిగిన ఉత్సవాల సమయంలో 644 మంది పోకిరీలను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో 94 మంది మైనర్లు కూడా ఉండటం గమనార్హం. ఈ నిందితుల్లో ఏడుగురికి కోర్టు వారం రోజుల జైలు శిక్ష విధించగా, 288 మందిని హెచ్చరించి విడిచిపెట్టారు. మరో 8 మందిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసారు. ఇలాంటి ఘటనలను నివారించేందుకు హైదరాబాద్ సిటీ పోలీసులు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

Next Story