అక్రమ కేసులపై ఎస్ఎఫ్ఐ ఆగ్రహం.. ఎత్తివేయాలని డిమాండ్

by Vemula.Srinu Prasad |

రాష్ట్రంలో పాఠశాల విద్య సమస్యలు పరిష్కారం చేయాలని, పెండింగ్ స్కాలర్ షిప్స్, ఫీజు రీయింబర్స్ మెంట్స్ విడుదల చేయాలని, ఫీజుల నియంత్రణ చట్టం తీసుకుని రావాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ ధర్నాలకు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది...

అక్రమ కేసులపై ఎస్ఎఫ్ఐ ఆగ్రహం.. ఎత్తివేయాలని డిమాండ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో పాఠశాల విద్య సమస్యలు పరిష్కారం చేయాలని, పెండింగ్ స్కాలర్ షిప్స్, ఫీజు రీయింబర్స్ మెంట్స్ విడుదల చేయాలని, ఫీజుల నియంత్రణ చట్టం తీసుకుని రావాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ ధర్నాలకు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా విద్యార్ధులపై సంగారెడ్డి, మహబూబాబాద్, ములుగు, కరీంనగర్, ఖమ్మం జిల్లాలోని కలెక్టరేట్ సందర్భంగా పోలీసులు తీవ్ర నిర్బంధం ప్రయోగించారని, సంగారెడ్డి జిల్లా కేంద్రంలో పోలీసులు అత్యుహ్సంతో విద్యార్ధి నాయకులను అరెస్టు చేసి అక్రమ కేసులు బనాయించి, వివిధ సెక్షన్ల పెట్టి కేసులు నమోదు చేసి బైండోవర్ చేశారని పేర్కొంది. ఈ చర్యలను, పోరాడుతున్న విద్యార్ధి నాయకులపై అక్రమ కేసులను ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ రాష్ట్ర అధ్యక్ష్య, కార్యదర్శులు ఎస్.రజనీకాంత్, టి.నాగరాజు ఖండిస్తున్నట్లు తెలిపారు.

కార్పొరేట్ తరహాలో రెండు జతలు యూనిఫామ్ ఇస్తామని యూనిఫామ్ ఇవ్వలేదని, ఇంటర్ విద్యార్ధులకు 2 నెలలు గడుస్తున్నా పాఠ్యపుస్తకాలు ఇవ్వలేదన్నారు. 10,800 కోట్లు పెండింగ్ స్కాలర్ షిప్స్ ఇవ్వకుండా, జీ.వో.నె: 7,8,9 తెచ్చి ఫీజులు పథకం ఎత్తివేయాలని కుట్రలు చేస్తోందన్నారు. తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా అక్రమంగా అరెస్ట్ చేసిన ఎస్ఎఫ్ఐ నాయకులను బేషరతుగా విడుదల చేసి అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అక్రమ కేసులు, అరెస్టులు, నిర్బంధాలను మేథావులు, ప్రజాస్వామిక వాదులు, విద్యార్థులు ఖండించాలని పిలుపునిచ్చారు.

Next Story