- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంద్రానగర్‌లో ఏరులై పారుతున్న మురికి నీరు..
గచ్చిబౌలి ఇంద్రనగర్ లో వర్షం మురికి నీరు వల్ల ప్రజలు ఇబ్బందిపడుతున్నారు.

దిశ, శేరిలింగంపల్లి: గచ్చిబౌలి ఇంద్రనగర్ లో వర్షం పడి వారం రోజులు దాటిపోయింది. కానీ అక్కడ మురికి నీరు ప్రవహిస్తూనే ఉంది. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. దుర్వాసనతో ఇంద్రానగర్ ,పీజేఆర్ కాలనీవాసులు తీవ్ర ఆవస్తులకు గురవుతున్నారు. ప్రతి ఏటా వేలాది రూపాయలు ఇంటి పన్ను లతో పాటు చివరేజ్ టాక్స్ కింద ప్రతినెల 3500 పన్నులు చెల్లిస్తున్న కాలనీ వాసులు నరకయాతన అనుభవిస్తున్నారు. అక్కడ పరిస్థితులు అత్యంత దయనీయంగా ఉన్నాయి.ఇది ఎక్కడో మారుమూల ప్రాంతంలో జరిగింది ఆనుకుంటే పొరపాటే. గచ్చిబౌలికి ప్రధాన రహదారికి అనుకొని ఇంద్రానగర్, పీజేఆర్ కాలనీలు ఉన్నాయి. బలహీన వర్గాల కోసం ఏర్పాటు చేసిన కాలనీలో ప్రస్తుతం గజం ధర రెండున్నర లక్షల పైబడి ఉంది. హాస్టల్లో నిర్వహణకు చిరునామా గా ఉన్న ఇంద్ర నగర్ లో మనుషులు జీవించడానికి అనువైన పరిస్థితులు అక్కడ లేవు. డ్రైనేజీ నిర్వహణ, మురికినీటిపాదల వ్యవస్థ మెరుగుపరిచే బాధ్యతలు సైబరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ నుంచి జల మండలి (హెచ్ ఎం డబ్ల్యు ఎస్ ఎస్ బి) కి బదిలీ అయింది. సమస్య ఉత్పన్నమైనప్పుడు ఫిర్యాదులు చేసేందుకు ప్రత్యేక వ్యవస్థ లేకపోవడంతో ప్రజలు నానవస్థలు పడుతున్నారు. మురికి నీటి సమస్య నిర్మూలించేందుకు కోట్ల రూపాయలు వెచ్చిస్తున్న సమస్య పరిష్కారం కావడం లేదు.
ఇంద్ర నగర్ నుంచి తరలిపోతున్న కాలనీవాసులు
ఇంద్ర నగర్ లో మురుగనీటి పారిదర వ్యవస్థ మెరుగుపరచలేదు. రెండు దశాబ్దాల క్రితం క్రితం ఏర్పాటుచేసిన మురికి నీటి కాలువలు ఇప్పటికీ వినియోగంలో ఉన్నాయి. ఈ కాలనీలో 200 కుటుంబాల నివాసముండగా ప్రస్తుతం ఆ ఇళ్లన్నీ హాస్టల్ గా రూపాంతరం చెందాయి. ఈ కాలనీలో 200 హాస్టల్ లు నిర్మించగా పదివేల మంది పైబడి నివాసం ఉంటున్నారు. శేరిలింగంపల్లి టౌన్ ప్లానింగ్ అధికారులు లంచాలకు ఆలవాటు పడి ఇష్టానుసారంగా జి ప్లస్ టు నిర్మించే చోట ఏడు ఎనిమిది అంతస్తులు నిర్మాణానికి సహకరించారు. ప్రస్తుతం ఆ ప్రాంతం తీవ్ర రద్దీ నెలకొంది. మురికి నీరు పోయే మార్గం లేక కాలనీవాసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దుర్వాసన భరించలేక చాలా కుటుంబాలు ఖాళీ చేసి వేరే చోటుకు తరలిపోతున్నారు. హాస్టల్లో ఉంటున్న వారు దుర్వాసన భరించలేక తరలిపోతుండడంతో హాస్టల్ నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మురికినీటి సమస్య పరిష్కరించమని ఫిర్యాదులు చేస్తే అధికారులు పట్టించుకోవడంలేదని ఇంద్ర నగర్ కాలనీవాసి కిరణ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని ఆయన కోరారు.






