సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గాంధీ శంకుస్థాపన

by Bhanu |

శేరిలింగంపల్లి నియోజకవర్గ సమగ్ర, సంతులిత, అభివృద్దే తన ధ్యేయం అని పీఏసీ ఛైర్మెన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు.

సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గాంధీ శంకుస్థాపన
X

దిశ, శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గ సమగ్ర, సంతులిత, అభివృద్దే తన ధ్యేయం అని పీఏసీ ఛైర్మెన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. శనివారం శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి నగర్ కాలనీ, రాజీవ్ గృహకల్ప, మసీదు బండ విలేజ్ లో రూ. 2 కోట్ల 31 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ పనులకు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల సంక్షేమం, శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని కాలనీల అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తున్నామని అన్నారు.


ప్రతీ కాలనీలో మౌళిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తానని అన్నారు. సంక్షేమం మరియు అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, పనుల్లో జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని పీఏసీ ఛైర్మెన్ గాంధీ అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కలిపిస్తామన్న ఆయన ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సుఖవంతమైన ప్రయాణానికి బాటలు వేస్తామని, నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని, అన్నివేళలో ప్రజలకు అందుబాటులో ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు, కాలనీల అసోసియేషన్ సభ్యులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Next Story