క్షుద్ర పూజలు కలకలం.. భయాందోళనలో స్థానికులు..

by Taduka Kalyani |

విద్యానగర్ నుంచి తార్నాక వైపు వెళ్లే రద్దీ రహదారిపై ఫుట్‌పాత్ పక్కన ఉన్న పెద్ద చెట్టు కాండానికి ఓ వ్యక్తి పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోను పెద్ద మేకులతో కొట్టి ఉంచినట్లు స్థానికులు గుర్తించారు.

క్షుద్ర పూజలు కలకలం.. భయాందోళనలో స్థానికులు..
X

దిశ, సికింద్రాబాద్: విద్యానగర్ నుంచి తార్నాక వైపు వెళ్లే రద్దీ రహదారిపై ఫుట్‌పాత్ పక్కన ఉన్న పెద్ద చెట్టు కాండానికి ఓ వ్యక్తి పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోను పెద్ద మేకులతో కొట్టి ఉంచినట్లు స్థానికులు గుర్తించారు. ఫొటోతో పాటు నల్లటి రంగులో ఉన్న ఓ వస్తువును కూడా చెట్టుకు అమర్చినట్లు కనిపించింది. వాటిపై కొన్ని గుర్తులు, ఆనవాళ్లు ఉండటంతో క్షుద్ర పూజలు నిర్వహించి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రహదారిపై పగలు, రాత్రి అనే తేడా లేకుండా వందలాది వాహనాలు, పాదచారులు రాకపోకలు సాగిస్తుంటారు. అర్ధరాత్రి వేళ గుర్తు తెలియని వ్యక్తులు ఈ చర్యకు పాల్పడి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. దీంతో రోడ్డుపై ప్రయాణించే వారు, సమీప ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అయితే, ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి అధికారిక నిర్ధారణ లేదని, ఇది నిజంగా క్షుద్ర పూజలకే సంబంధించినదా లేదా మరేదైనా కారణం ఉందా అన్నది దర్యాప్తులో తేలాల్సి ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యానగర్–తార్నాక రోడ్డులోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించి, ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించాలని స్థానికులు కోరుతున్నారు. ప్రజల్లో భయాందోళనలు సృష్టించే ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Next Story