- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విడాకుల తర్వాత కెరీర్‌పై ఫోకస్ పెట్టిన హన్సిక.. క్రైమ్ డ్రామాతో రీఎంట్రీ!
ప్రవీణ్ సట్టారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గల్లీ’ అనే భారీ యాక్షన్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్ ద్వారా హన్సిక మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘దేశముదురు’ సినిమాతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి, తన క్యూట్ లుక్స్‌తో తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకున్నారు నటి హన్సిక మోత్వాని. ఆ తర్వాత వరుస స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ తెలుగు, తమిళం, హిందీలో నటించారు. ఇక కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్న సమయంలోనే ఆమె బిజినెస్‌మెన్ సోహైల్ కతూరియాను ప్రేమించి వివాహం చేసుకున్నారు. అయితే, పెళ్లి తర్వాత ఆమె వ్యక్తిగత జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురయ్యాయి. భర్తతో వచ్చిన మనస్పర్థల కారణంగా ఇటీవల వీరిద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుని విడిపోయారు.
ఈ బాధ నుండి బయటపడిన హన్సిక, ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్‌ను స్టార్ట్ చేయబోతున్నారు. ప్రవీణ్ సట్టారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గల్లీ’ అనే భారీ యాక్షన్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్ ద్వారా ఆమె మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌లో జేడీ చక్రవర్తి, సుధీర్ బాబు, ప్రిన్స్, శ్రీనిధి శెట్టి కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. తాజాగా ఈ సిరీస్‌కు సంబంధించిన కీలక షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్‌లోని చారిత్రాత్మక చార్మినార్ పరిసర ప్రాంతాలలో జరిగింది. ఈ షూటింగ్‌లో హన్సిక, జేడీ చక్రవర్తితో కలిసి కొన్ని కీలక సీన్లలో నటించారు. అక్కడ ఆమె ఎంతో సాంప్రదాయబద్ధంగా చుడీదార్ ధరించి కనిపించారు. చార్మినార్ వద్ద హన్సిక షూటింగ్ చేస్తున్న వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.






