- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Vahan Parivahan : వాహాన్ పోర్టల్ లో అప్డేట్ అవ్వండి..
వాహనదారులు తప్పని సరిగా వాహన్ పోర్టల్ లో మొబైల్ నెంబరు, ఈ-మెయిల్ ఐడీలను అప్ డేట్ చేసుకోవాలని హైదరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ తెలిపారు.

దిశ, సిటీక్రైం : మీ వాహనాలపై ఉన్న ట్రాఫిక్ చలాన్ లతో పాటు ఇతర ముఖ్య సమాచారం వాట్సాప్, ఎస్ఎంఎస్, మెయిల్ ద్వారా పొందాలంటే వాహనదారులు తప్పని సరిగా వాహన్ పోర్టల్ లో మొబైల్ నెంబరు, ఈ-మెయిల్ ఐడీలను అప్ డేట్ చేసుకోవాలని హైదరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ మంగళవారం తెలిపారు. vahan.parivahan.gov.in పోర్టల్ ద్వారా లేదా పోర్టల్ లో ఉండే క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసుకుని వివరాలను సులభంగా అప్ డేట్ చేసుకోవచ్చని వివరించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వాహన్ పోర్టల్ లో నమోదైన మెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్లకు పంపే చలాన్ ల సమాచారం అధికారికంగా పరిగణిస్తామని , వాటిని నిర్లక్ష్యం చేయొద్దని సీపీ స్పష్టం చేశారు. కాబట్టీ వాహనదారులు ఈ పోర్టల్ లో నమోదు చేసుకుని ఎప్పటికప్పుడు మీ ట్రాఫిక్ ఉల్లంఘనలపై పడే చలాన్ ల సమాచారాన్ని తెలుసుకోవచ్చు. చలాన్ లను వెంటనే చెల్లించుకునేందుకు అవకాశం ఉంటుంది. మీ చలాన్ లపై అప్రమత్తంగా కూడా ఉండొచ్చని సీపీ పేర్కొన్నారు.






