భూ శాస్త్రవేత్తల కృషి అభినంద‌నీయం: జీఎస్ఐ డైరెక్టర్

by Yella Dhawani Reddy |

భూ శాస్త్రవేత్తల కృషి అభినంద‌నీయం: జీఎస్ఐ డైరెక్టర్
X

దిశ‌, ఎల్బీన‌గ‌ర్: భారతీయ భూ శాస్త్రవేత్తల ఓరియంటేషన్ కోర్సుల ప్రారంభ సదస్సు శుక్రవారం నాగోల్‌లోని జియోలాజిక‌ల్ స‌ర్వే ఆఫ్ ఇండియా శిక్షణా సంస్థ ఎం.ఎస్.కృష్ణన్ ఆడిటోరియంలో నిర్వహించారు. ప్రారంభ సదస్సుకు జీఎస్ఐ డైరెక్టర్ జ‌న‌ర‌ల్ రాజేంద్ర సింగ్ గుల్జార్‌ అధ్యక్షత వహించారు. జీఎస్ఐ కోల్‌క‌త ట్రైనింగ్ మేనేజ‌ర్ ఎం. ఎం పొవార్, జీఎస్ఐ ఏడీజీ విభాగాధిప‌తి జనార్దన్ ప్రసాద్, మిష‌న్‌-5 శిక్షణా సంస్థ డైరెక్టర్లు సీహెచ్ వెంకటేశ్వరరావు, సీనియర్ అధికారులు సదస్సుకు హాజరయ్యారు. శిక్షణా సంస్థ అధిపతి సీహెచ్.వెంకటేశ్వరరావు, 171 సంవత్సరాల నాటి ప్రతిష్టాత్మక సంస్థలో ప్రవేశించినందుకు భూవిజ్ఞాన శాస్త్రవేత్తలను అభినందించారు. ఈ సందర్భంగా ఎంఎం పొవార్ మాట్లాడుతూ.. శిక్షణా సంస్థ చేస్తున్న ప్రయత్నాలను అభినందించారు. ఉజ్వల భవిష్యత్తు కోసం భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు చేస్తున్న కృషిని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. జనార్దన్ ప్రసాద్, రాజేంద్ర సింగ్ గర్జాల్‌లు జీఎస్ఐలో కొత్తగా చేరిన భూ విజ్ఞాన శాస్త్రవేత్తలను ఉద్దేశించి ప్రసంగించారు. జీఎస్ఐ, అత్యుత్తమ భూ విజ్ఞాన సంస్థ అని, వివిధ భూవిజ్ఞాన శాఖలలో అద్భుతమైన అధికారుల బృందాన్ని కలిగి ఉందని, ఖనిజాల అన్వేషణకు అత్యుత్తమ కృషి చేస్తుందని ప్రశంసించారు. శిక్షణ పొందిన అధికారులందరి భవిష్యత్తు బాగుండాలని వారు ఆకాంక్షించారు.

Next Story