- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రూ.50 లక్షల గంజాయి పట్టివేత.. నలుగురు అరెస్ట్
నగరంలో గంజాయి అక్రమ రవాణాను ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు భగ్నం చేశారు. సుమారు రూ.50 లక్షల విలువైన 42.9 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.

దిశ, సికింద్రాబాద్ : నగరంలో గంజాయి అక్రమ రవాణాను ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు భగ్నం చేశారు. సుమారు రూ.50 లక్షల విలువైన 42.9 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. తుని, నర్సీపట్నం, శ్రీకాకుళం ప్రాంతాల నుంచి గంజాయిని సేకరించిన నిందితులు కొణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలులో నాలుగు బ్యాగుల్లో తీసుకువచ్చారు. అనంతరం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని సీనియర్ సెక్షన్ ఇంజనీరింగ్ కార్యాలయం వద్ద కొనుగోలుదారుని కోసం వేచి ఉండగా.. ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ చంద్రశేఖర్ గౌడ్ బృందం దాడి చేసి పట్టుకుంది. నిందితుల వద్ద ఉన్న బ్యాగులను తనిఖీ చేయగా 20 గంజాయి పాకెట్లు లభించాయి. వాటి మొత్తం బరువు 42.9 కిలోలుగా నమోదైంది.
ప్రధాన నిందితుడు ఖాన్ సజావర్ నవాజ్ ఖాన్ వద్ద రూ.72,500 నగదును కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో గణేష్ శివనాథ్ బోడుగే (42), పరమేశ్వర్ దామోదర్ బాలప్ (33), విన్నీ శైలేష్ మేశారాం (32), ఖాన్ సజావర్ నవాజ్ ఖాన్ (54) ఉన్నారు. వీరంతా మహారాష్ట్రకు చెందినవారని అధికారులు తెలిపారు. ఏపీ ప్రాంతాల నుంచి గంజాయిని కొనుగోలు చేసి ముంబై, పుణే నగరాలకు సరఫరా చేస్తున్నట్లు బయటపడింది. కిలోకు రూ.4 వేలకే కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాల్లో రూ.12 వేల నుంచి రూ.20 వేల వరకు విక్రయిస్తున్నట్లు నిందితులు ఒప్పుకున్నారు. నిందితులను సికింద్రాబాద్ ఎక్సైజ్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు. ఈ ఆపరేషన్‌లో సీఐలు చంద్రశేఖర్ గౌడ్, కోటమ్మ, ఎస్సైలు శ్రీనివాసులు, రూప, భూపాల్ తదితరులు పాల్గొన్నారు. భారీగా గంజాయి పట్టివేతకు పాల్పడిన బృందాన్ని హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్ అనిల్ కుమార్ రెడ్డి అభినందించారు.






