- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అడ్డు గోడ కూలింది.. సర్కారు బడికి బాట దొరికింది..
సికింద్రాబాద్‌లోని చిలకలగూడ దూద్‌బావి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల దారికి అడ్డంగా నిర్మించిన గోడను హైడ్రా అధికారులు మంగళవారం కూల్చివేశారు.

దిశ, సికింద్రాబాద్: సికింద్రాబాద్‌లోని చిలకలగూడ దూద్‌బావి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల దారికి అడ్డంగా నిర్మించిన గోడను హైడ్రా అధికారులు మంగళవారం కూల్చివేశారు. సోమవారం జీహెచ్ ఎంసీ జోనల్ కార్యాలయం ఎదుట ప్రధానోపాధ్యాయుడు మల్లికార్జున్ రెడ్డి 'సీఎం గారు....! మా బడికి బాట వేయించండి' అంటూ ప్ల కార్డు పట్టుకుని ధర్నాకు దిగిన వార్త మీడియాలో ప్రసారం కావడంతో హైడ్రా రంగంలోకి దిగింది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాలతో ఇన్‌స్పెక్టర్ ఆదిత్య క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
ఆ పాఠశాలకు వెళ్లే మార్గంలో అక్కడి నివాసితులు దారికి అడ్డంగా గోడను నిర్మించారు. దీంతో విద్యార్థులు స్కూల్కు వెళ్లడానికి పక్కనే ఉన్నచిన్నపాటి గళ్లి నుంచి వస్తున్నట్లు గుర్తించారు. విద్యార్తులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకుగాను దారికి అడ్డంగా నిర్మించిన ప్రహరీని తొలగించారు. జీహెచ్ ఎంసీ టౌన్ ప్లానింగ్ ఏసీపీ శ్రీనివాస్‌తో పాటు సిబ్బంది కూడా ఉండి అడ్డు గోడ తొలగింపు పనులను పర్యవేక్షించారు. ప్రహరీ తొలగించిన చోట వెంటనే గేటు ఏర్పాటు చేస్తామని జోనల్ కమిషనర్ రవి కిరణ్‌గారు వెల్లడించారు.






