Secunderabad MLA : రాజకీయాలకు అతీతంగా ప్రజల కోసం పని చేస్తా

by Chintha Aamani |

రాజకీయాలకు అతీతంగా ప్రజల కోసం పనిచేస్తానని సికింద్రాబాద్

Secunderabad MLA : రాజకీయాలకు అతీతంగా ప్రజల కోసం పని చేస్తా
X

దిశ, సికింద్రాబాద్: రాజకీయాలకు అతీతంగా ప్రజల కోసం పనిచేస్తానని సికింద్రాబాద్ ఎమ్మెల్యే(Secunderabad MLA) తీగుళ్ల పద్మారావు గారు గౌడ్ అన్నారు. మంగళవారం సీతాఫల్మండి డివిజన్ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. జోషీ కాంపౌండ్ లో రూ.౩౩ లక్షల ఖర్చుతో సీసీ రోడ్డు నిర్మాణం పనులను, టీఆర్టీ కాలనీ పార్క్ లో రూ.7 లక్షల ఖర్చుతో ఓపెన్ జిమ్ ను (Open gym) ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా ప్రజలకు ఉపకరించే కార్యక్రమాలను, అభివృద్ధి పనులను తాను చేపడుతున్నానని చెప్పారు. జోషి కాంపౌండ్, టీ.ఆర్.టీ. క్వార్టర్స్ ప్రాంతాలను సమస్యల రహిత ప్రాంతాలుగా తీర్చి దిద్దితున్నామని చెప్పారు. సీతాఫల్మండి లో నిర్మించే ప్రభుత్వ కళాశాల నూతన భవన నిర్మాణానికి ఈ ప్రభుత్వంలో నిధుల కొరత ఏర్పడటం దురదృష్టం అన్నారు.

అనంతరం డివిజన్ కార్పొరేటర్ సామల హేమ మాట్లాడుతూ సీతాఫలమండి డివిజన్ లో అన్ని సమస్యలను స్థానిక ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ సహకారంతో పరిష్కరించామన్నారు. ప్రజల కోసం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల వద్ద పలువురు కాంగ్రెస్ నాయకులు ప్రోటోకాల్ పాటించకుండా అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడం సరికాదన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కరాటే రాజు, జోషి కాంపౌండ్ అధ్యక్షుడు రాజ సుందర్, ప్రధాన కార్యదర్శి సుభాష్, టీ.ఆర్.టీ. కాలనీ సంఘం నేతలు జుగ్ను శేఖర్, రాజేష్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story