- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేపు సికింద్రాబాద్ అస్తిత్వం, ఆత్మగౌరవ ర్యాలీ
సికింద్రాబాద్ పేరు మార్చేందుకు కుట్ర జరుగుతోందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: సికింద్రాబాద్ పేరు మార్చేందుకు కుట్ర జరుగుతోందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేపు ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ అస్తిత్వం, ఆత్మగౌరవ ర్యాలీ జరుగుతుందని తెలిపారు. రైల్వే స్టేషన్ నుంచి MG రోడ్‌లోని గాంధీ విగ్రహం వరకు ఈ ర్యాలీ కొనసాగుతుందని వెల్లడించారు. సికింద్రాబాద్‌ను నామరూపాలు లేకుండా చేయాలని.. కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. కమిషనరేట్‌లను అక్రమంగా కలిపారని, ఇలా ఎందుకు కలిపారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా.. పేర్లు మారుస్తూ తుగ్లక్ పాలన చేస్తున్నారని తీవ్ర విమర్శలు గుప్పించారు. రేపు కార్యక్రమానికి కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వస్తారు.. మిగతా వాళ్ళు కూడా కలిసి రావాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ పిలుపునిచ్చారు.






