- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సికింద్రాబాద్ నియోజకవర్గం బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడిగా లోకేష్ కుమార్
నేషనల్ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ సికింద్రాబాద్ అసెంబ్లీ అధ్యక్షుడిగా నాగిశెట్టి లోకేష్ కుమార్‌ను నియమించింది. ఈ మేరకు జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య అధికారిక నియామక ఉత్తర్వులు జారీ చేశారు.

దిశ, సీతాఫలమండి : నేషనల్ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ సికింద్రాబాద్ అసెంబ్లీ అధ్యక్షుడిగా నాగిశెట్టి లోకేష్ కుమార్‌ను నియమించింది. ఈ మేరకు జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య అధికారిక నియామక ఉత్తర్వులు జారీ చేశారు. నాగిశెట్టి లోకేష్ కుమార్ తెలంగాణ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ పరిధిలో సికింద్రాబాద్ అసెంబ్లీ అధ్యక్షుడిగా తక్షణ ప్రభావంతో బాధ్యతలు స్వీకరించనున్నారు. బీసీ వర్గాల అభ్యున్నతి, సంక్షేమ కార్యక్రమాల సమర్థవంతమైన అమలు, అలాగే సంఘాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ నియామకం చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ నియామక ఉత్తర్వులపై నేషనల్ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్యతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ డా. ర్యాగ అరుణ్ కుమార్ సంతకాలు చేశారు. నూతన బాధ్యతలు స్వీకరించిన నాగిశెట్టి లోకేష్ కుమార్ మాట్లాడుతూ బీసీ సమాజ అభివృద్ధి కోసం కృషి చేస్తానని, అసోసియేషన్ కార్యక్రమాలను సికింద్రాబాద్ అసెంబ్లీ పరిధిలో మరింత విస్తృతంగా అమలు చేస్తానని తెలిపారు.






