షూటింగ్ పూర్తి చేసుకున్న 'విశ్వనాథ్ అండ్ సన్స్'

by Pulgam srinivas |

తాజాగా 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది.

షూటింగ్ పూర్తి చేసుకున్న విశ్వనాథ్ అండ్ సన్స్
X

దిశ, వెబ్ డెస్క్: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'విశ్వనాథ్ అండ్ సన్స్' చిత్రంలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. మమిత బైజు ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనుండగా, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రాన్ని ఆగస్టు 21న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో ఈ మూవీ షూటింగ్‌ను మేకర్స్ తాజాగా పూర్తి చేసినట్లు సమాచారం.

అంతేకాకుండా, ఈ చిత్రానికి సంబంధించిన కొంత భాగం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. మిగిలిన పనులను మరికొద్ది రోజుల్లో ముగించి, ఆ తర్వాత భారీ స్థాయిలో ప్రమోషన్స్ ప్రారంభించాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. చాలా కాలంగా వరుస అపజయాలతో సతమతమవుతున్న సూర్య, ఇటీవల 'వీరభద్రుడు' సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. దీంతో ఇప్పుడు 'విశ్వనాథ్ అండ్ సన్స్'పై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమాతో సూర్య మరోసారి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Next Story