- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Delhi: ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. 200 పైగా దగ్ధమైన కార్మికుల నివాసాలు
ఢిల్లీలోని ఉద్యోగ్ భవన్ సమీపంలో ఉన్న కార్మికుల నివాసాల్లో (ఝుగ్గీలు) బుధవారం వేకువజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీలోని ఉద్యోగ్ భవన్ సమీపంలో ఉన్న కార్మికుల నివాసాల్లో (ఝుగ్గీలు) బుధవారం వేకువజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు 200 తాత్కాలిక రేకుల షెడ్లు అగ్నికి ఆహుతయ్యాయి. అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, ప్రాణనష్టం తప్పిందని అధికారులు వెల్లడించారు. ఢిల్లీ అగ్నిమాపక దళం (DFS) అధికారుల సమాచారం మేరకు.. తెల్లవారుజామున 3.02 గంటల ప్రాంతంలో కార్మికుల గుడిసెల వద్ద ఉన్న ఓ విద్యుత్ ప్యానెల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గుడిసెలు ఒకదానికొకటి ఆనుకుని ఉండటంతో పాటు, లోపల ఉన్న వంట గ్యాస్ (LPG) సిలిండర్ల కారణంగా మంటలు అత్యంత వేగంగా వ్యాపించాయి. సమాచారం అందుకున్న వెంటనే 19 ఫైరింజన్లతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. తీవ్రంగా శ్రమించి ఉదయం 5.30 గంటలకల్లా మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు.
కారణాలపై దర్యాప్తు...
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే, ప్రమాదానికి గల కచ్చితమైన కారణం, ఆస్తి నష్టం అంచనాపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ‘సెంట్రల్ విస్టా’ ప్రాజెక్టులో భాగంగా.. 1950ల్లో నిర్మించిన ప్రముఖ ప్రభుత్వ కార్యాలయాల సముదాయం ‘ఉద్యోగ్ భవన్’ను ప్రస్తుతం కూల్చివేస్తున్నారు. దాని పక్కనే ఉన్న నిర్మాణ్ భవన్ కూల్చివేత అనంతరం ఈ పనులు చేపట్టారు. ఈ పనుల్లో పాల్గొంటున్న కార్మికుల కోసమే ఇక్కడ ఈ తాత్కాలిక నివాసాలను ఏర్పాటు చేశారు.






