- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విరబోసిన కురులతో కిల్లింగ్ పోజులు ఇచ్చిన నుపూర్ సనన్
పింక్ అండ్ వైట్ లుక్‌లో మెరిసిపోయిన నుపూర్ సనన్.

దిశ, వెబ్ డెస్క్: మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ నుపూర్ సనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన 'టైగర్ నాగేశ్వరరావు' చిత్రంతో ఈ భామ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.
ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా, నుపూర్ తన అందం, అభినయంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించి మంచి గుర్తింపును సంపాదించుకుంది.
అయితే ఆ తర్వాత టాలీవుడ్‌లో ఆమెకు పెద్దగా అవకాశాలు రాకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో నిరంతరం టచ్‌లో ఉంటుంది. ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ఫోటోషూట్‌లను షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
తాజాగా నుపూర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని స్టన్నింగ్ ఫోటోలను పోస్ట్ చేసింది. పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్‌లో ఉన్న స్టైలిష్ డ్రెస్‌లో మెరిసిపోయిన ఈ బ్యూటీ, తన అందమైన హెయిర్ స్టైల్‌తో పాటు కిల్లింగ్ పోజులతో ఫోటోలకు ఫోజులిచ్చింది.
ఈ ఫోటోల్లో నుపూర్ ఎంతో అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుండటంతో ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అభిమానులు సైతం ఆమె అందానికి ఫిదా అవుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Photos Courtesy: Instagram






