PVNR ఎక్స్‌ప్రెస్‌ వే పై స్కార్పియో దగ్ధం.. తృటిలో తప్పిన పెను ప్రమాదం

by Bhanu |   (  Updated:2025-06-25 15:32:39  IST  )

స్కార్పియో వాహనంతో పీవీనే ఎక్స్‌ప్రెస్‌వే పై ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. బుధవారం మధ్యాహ్నం గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిల్లర్ నెంబర్ 110 సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

PVNR ఎక్స్‌ప్రెస్‌ వే పై స్కార్పియో దగ్ధం.. తృటిలో తప్పిన పెను ప్రమాదం
X

దిశ, కార్వాన్ : స్కార్పియో వాహనంతో పీవీనే ఎక్స్‌ప్రెస్‌వే పై ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. బుధవారం మధ్యాహ్నం గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిల్లర్ నెంబర్ 110 సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

రాజేంద్రనగర్‌కు చెందిన జాహీద్ హుస్సేన్ తన స్కార్పియో వాహనంలో మెహిదీపట్నం వైపు వెళ్తుండగా, ఒక్కసారిగా వాహనంలో షార్ట్ సర్క్యూట్ ఏర్పడింది. క్షణాల్లోనే మంటలు చెలరేగడంతో వాహనం దహనమైంది. ప్రమాదాన్ని గమనించిన అతను వెంటనే వాహనాన్ని ఆపి దిగడంతో ప్రాణాపాయం తప్పింది.

వెంటనే ఫైర్ ఇంజన్‌కు సమాచారం అందించగా, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. వాహనం పూర్తిగా దగ్ధమైనా, ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ట్రాఫిక్ పోలీసులు వాహనాన్ని పక్కకు తరలించడంతో రాకపోకలు కొనసాగాయి.

Next Story