హైదరాబాద్‌లో దారుణం.. నర్సరీ విద్యార్థిని కాళ్ళ కిందేసి తొక్కిన స్కూల్ ఆయా

by Muthe.Rajitha |

హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది.

హైదరాబాద్‌లో దారుణం.. నర్సరీ విద్యార్థిని కాళ్ళ కిందేసి తొక్కిన స్కూల్ ఆయా
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. నగరంలోని జీడిమెట్ల ప్రాంతంలో ఓ స్కూల్ నర్సరీ చదువుతున్న చిన్నారి పట్ల ఆ స్కూల్‌ ఆయా కర్కశంగా ప్రవర్తించిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. షాపూర్‌ నగర్‌లోని ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న ఆ బాలికను శనివారం స్కూల్‌ ముగిసిన తర్వాత ఆయా ఇష్టానుసారం కొట్టింది. అంతేకాదు చిన్నారిపై కాలు వేసి తొక్కుతూ దారుణంగా హింసించింది. ఇంటికి వచ్చిన బాలికకు తీవ్ర జ్వరం రావడంతో తల్లిదండ్రులకు అసలు విషయం చెప్పడంతో వారు పాఠశాల యాజమాన్యాన్ని ప్రశ్నించారు.

అయితే ఆయా కొడుతున్న సమయంలో పక్క భవనంలో ఉఉంటున్న ఓ యువకుడు సంఘటనను వీడియో తీశాడు. ఆ వీడియో కాస్త ఆదివారం వాట్సాప్‌ గ్రూప్‌ల్లో వైరల్‌ అవడంతో తల్లిదండ్రులు జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం బాలికకు స్థానిక ఆసుపత్రిలో అత్యవసర చికిత్స అందిస్తున్నట్టు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పాఠశాల ప్రిన్సిపల్ తోపాటు, యాజమాన్యానికి నోటీసులు పంపించారు. విచారణ అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే స్కూల్ గుర్తింపు రద్దు చేసి, సీజ్ చేయాలని తల్లిదండ్రుల నుంచి డిమాండ్స్ వస్తున్నాయి.

Next Story