స్కాల‌ర్ షిప్ ఫీజు బ‌కాయిల‌ను వెంట‌నే విడుద‌ల చేయాలి : రాజ్య‌స‌భ‌ ఎంపీ ఆర్.కృష్ణయ్య

by Ratna Kumari |

స్కాల‌ర్ షిప్ ఫీజు బ‌కాయిల‌ను వెంట‌నే విడుద‌ల చేయాల‌ని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్య‌స‌భ‌ ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు.

స్కాల‌ర్ షిప్ ఫీజు బ‌కాయిల‌ను వెంట‌నే విడుద‌ల చేయాలి : రాజ్య‌స‌భ‌ ఎంపీ ఆర్.కృష్ణయ్య
X

దిశ, హిమాయత్ నగర్ : స్కాల‌ర్ షిప్ ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థులను ఫీజుల కోసం ట్రస్ట్ బ్యాంకుల వద్ద తిరగకుండా చూడాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్య‌స‌భ‌ ఎంపీ ఆర్.కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం లోయర్ ట్యాంక్ బండ్‌లోని అంబేద్కర్ విగ్రహం ముందు విద్యార్థులతో కలిసి ఆయన ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ... రాష్ట్రంలో 119 బీసీ గురుకులాలు, 100 బీసీ కాలేజ్ హాస్టళ్లను మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. బీసీ కాలేజ్ హాస్టళ్లలో సీట్లు అందుబాటులో లేకపోవడంతో అనేక మంది విద్యార్థులు రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో రాత్రులు గడుపుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఎంపీ కృష్ణయ్య కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నేతలు నీలా వెంకటేష్, అనంతయ్య, సతీష్, రాందేవ్ మోదీ , నిమ్మల వీరన్న పాల్గొన్నారు.

Next Story