Sadar Celebrations : హైదరాబాద్ లో ఘనంగా సదర్ ఉత్సవాలు

by Muthe.Rajitha |

హైదరాబాద్‌(Hyderabad)లో ప్రతీ సంవత్సరం దీపావళికి యాదవులు సదర్ ఉత్సవాల(Sadar Celebrations)ను ఘనంగా నిర్వహిస్తారు.

Sadar Celebrations : హైదరాబాద్ లో ఘనంగా సదర్ ఉత్సవాలు
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌(Hyderabad)లో ప్రతీ సంవత్సరం దీపావళికి యాదవులు సదర్ ఉత్సవాల(Sadar Celebrations)ను ఘనంగా నిర్వహిస్తారు. నగరంలోని నారాయణగూడ(Narayaguda), ఖైరతాబాద్(Khairathabad) లో ఇప్పటికే ఉత్సవాలు మొదలయ్యాయి. డీజే చప్పుళ్లతో, యాదవుల ఆటలతో, అందంగా అలంకరించిన భారీ దున్నలతో పలు ప్రాంతాలు సందడిగా మారాయి. హరియాణా నుంచి తీసుకొచ్చిన ఘోలు-2 అంతర్జాతీయ ఛాంపియన్ బుల్‌తో శ్రీకృష్ణ, షైరా, బాదో, విదాయక్ వంటి దున్నలు ఈ సదర్ ఉత్సవాల్లో సందడి చేస్తున్నాయి. నారాయణగూడ వైఎంసీఏ, ఖైరతాబాద్ మహా గణేష్ చౌరస్తాలో సదర్ ఉత్సవాలు దద్దరిల్లి పోతున్నాయి.

Next Story