- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
RTC MD సజ్జనార్‌కు సెలవులు.. కారణం ఇదే!
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ(TGSRTC) మేనేజింగ్ డైరెక్టర్ వీ.సీ. సజ్జనార్(V.C. Sajjanar)కు రాష్ట్ర ప్రభుత్వం నెల రోజుల సెలవు మంజూరు చేసింది.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ(TGSRTC) మేనేజింగ్ డైరెక్టర్ వీ.సీ. సజ్జనార్(V.C. Sajjanar)కు రాష్ట్ర ప్రభుత్వం నెల రోజుల సెలవు మంజూరు చేసింది. అయితే ఈ సెలవులు ఆయన వ్యక్తిగత కారణాల రీత్యా తీసుకున్నట్టు వార్తలు వస్తున్నప్పటికీ, నెలరోజుల సెలవులు సజ్జనార్ తీసుకున్నారా? ప్రభుత్వమే పంపిందా అనే విషయం తెలియరాలేదు. ఈ నెల రోజులు TGSRTC ఇన్‌చార్జ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేంద్ర మోహన్‌ను ప్రభుత్వం నియమించినట్టు తెలుస్తోంది. రవాణా శాఖలో ఉన్నతాధికారిగా ఉన్న అనుభవంతో సురేంద్ర మోహన్‌ను సంస్థలో రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి నియమించినట్టు సమాచారం. సజ్జనార్ 2021 నుండి TGSRTC ఎండీగా కొనసాగుతూ సంస్థను ఆర్థిక స్థిరత్వం దిశగా నడిపించడం, ఉద్యోగుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యం కోసం అనేక చర్యలు తీసుకున్నారు.






