Bandi Bhagirath case : బండి భగీరథ్‌కు శిక్ష పడేదాక పోరాడుతాం: ఆర్ఎస్ ప్రవీణ్

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-05-21 15:17:49  IST  )

సీఎం రేవంత్ రాజకీయ చరిత్ర అంతా అబద్ధమని.. ఆయన సీఎం కాకముందు, అయ్యాక సైతం అబద్ధాలే చెబుతున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ అన్నారు....

Bandi Bhagirath case : బండి భగీరథ్‌కు శిక్ష పడేదాక పోరాడుతాం:  ఆర్ఎస్ ప్రవీణ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం రేవంత్ రాజకీయ చరిత్ర అంతా అబద్ధమని.. ఆయన సీఎం కాకముందు, అయ్యాక సైతం అబద్ధాలే చెబుతున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ అన్నారు. గురువారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన తన గురించి సైతం అబద్ధాలు చెబుతున్నారని.. తన ఉద్యోగం పోయిందని అంటున్నారని.. తన ఉద్యోగం పోలేదని.. తానే బయటకు వచ్చానని చెప్పారు. ఇలాంటి వారు చేసే దుర్మార్గాలు, అన్యాయాలను ప్రశ్నించడానికే వచ్చానని తెలిపారు. రాష్ట్రంలో రోజురోజుకూ శాంతిభద్రతలు అడుగంటిపోతున్నాయని.. అమ్మాయిలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయని అన్నారు. పోక్సో కేసులో నిందితుడిని కాపాడడానికి సీఎం పడుతున్న తంటాలు ప్రజలకు అర్థమవుతున్నాయని అన్నారు. ప్రధాన నిందితుడు జైలుకు వెళ్లిండు అంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీ వల్లనే అని తెలిపారు. లేదంటే స్టేషన్ బెయిల్ తీసుకొని తిరిగేవాడని ఆరోపించారు. అయితే.. బండి భగీరథ్‌ను అరెస్ట్ చేశామని సీఎం చెప్తున్నారని.. నాకా బంధీ పెట్టి పట్టుకున్నామని అంటున్నారని.. మరోపక్క బాధ్యతాయుత మంత్రిగా తానే తన కొడుకును సరెండర్ చేయించానని బండి సంజయ్ పదేపదే చెప్తున్నారని.. ప్రజలు ముఖ్యమంత్రి మాటలు నమ్మాలా? కేంద్ర మంత్రి మాటలు నమ్మాలా? అని ప్రశ్నించారు.

నిందితుని వెంట ఎస్ఓటీ పోలీసులు ఎందుకు లేరని.. ఒకవేళ పోలీసులు అరెస్ట్ చేస్తే పోలీస్ వాహనంలో తీసుకెళ్లాలని.. కానీ ఆ రోజు నిందితునితో పోలీసులకు బదులు బీజేపీకి చెందిన లాయర్లు ఎందుకు ఉన్నారని నిలదీశారు. బాధితురాలి పేరును బీజేపీ వారే బయటపెట్టారని.. కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో మే 8న కేసు నమోదు చేస్తే అందులో అమ్మాయి పేరు తల్లిదండ్రుల పేర్లు రాశారని స్పష్టం చేశారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి బావ, మరదల్ల సంస్కృతి అంటున్నారని.. ఇది వారు అమ్మాయిల పట్ల చూపించే గౌరవమని ఎద్దేవా చేశారు. పేట్ బషీరాబాద్‌లో నమోదైన ఎఫ్ఐఆర్‌లో బండి భగీరథ్‌తోపాటు అదర్స్ అని నమోదు చేశారని.. అదర్స్ అంటే ఎవరని ప్రశ్నించారు. అదర్స్‌లో బండి సంజయ్ పేరు ఎందుకు పెట్టడం లేదని.. సంజయ్ ఇంటి ముందు ఉన్న సీసీ కెమెరా ఫుటేజీ తీసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 22,23న కాల్ డేటా భద్రపరచాలని.. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో శిక్ష పడేదాక పోరాడుతామని ఆర్ఎస్ ప్రవీణ్ హెచ్చరించారు.

Next Story