మీ వెంట నేనుంటా.. నిరుద్యోగ భరోసా సదస్సులో ఆర్‌ఎస్పీ

by Disha Web Desk 13 |
మీ వెంట నేనుంటా.. నిరుద్యోగ భరోసా సదస్సులో ఆర్‌ఎస్పీ
X

దిశ, అంబర్ పేట్: అభ్యర్థులంతా నిరాశ చెందకుండా బాగా చదవాలని విద్యార్థుల వెనుక ప్రవీణ్ కుమార్ అండగా ఉంటాడని బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. విద్యార్థులకు నిరుద్యోగ భరోసా సదస్సు చిక్కడపల్లి శ్రీ త్యాగరాయ గానసభలో నిర్వహించారు. విద్యార్థులకు పవర్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేపర్ లీకేజీ వ్యవహారం పై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యత వహించి సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీ వ్యవహారంలో ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి కస్టడీలో ఉన్న వారి ప్రాణాలకు ప్రమాదం ఉందన్నారు. వారి వద్ద విలువైన సమాచారం ఉందని, కావాలనే వారిని ప్రశ్నించడం లేదని విమర్శించారు. కేసును సీబీఐ కు అప్పగించకుండా ఎలాంటి సదుపాయాలు లేని సిట్ అప్పగించి నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

టీఎస్పీఎస్సీ చైర్మెన్‌తో పాటు బోర్డు సభ్యులు కూడా తొలగించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ అభ్యర్థులకు నష్టపరిహారం ఇవ్వాలన్నారు. హెల్ప్ లైన్, పౌష్టికాహారం, కౌన్సెలింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యమంత్రి ఇప్పటి వరకు ఒక్క మాట మాట్లాడలేదని ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి విచారణ సంపూర్ణంగా చేయాలనే చిత్తశుద్ధి లేదని, నామ మాత్రంగానే విచారణ కేవలం ఇద్దరి వ్యక్తుల సమస్యగా చెబుతూ.. తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.

బహుజన రాజ్యం లో ఖచ్చితంగా ఎసీ స్టడీ సెంటర్లు ఏర్పాటు చేస్తామని విద్యార్థులకు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దయానంద రావు, రాష్ట్ర మహిళా కన్వీనర్ అనిత రెడ్డి, అధికార ప్రతి నిధులు డా. వెంకటేష్ చౌహాన్, డా. సాంబశివ గౌడ్, అరుణ క్వీన్, రాష్ట్ర నాయకులు ధర్మేందర్, విజయ్ ఆర్య, శైలజా, హైదరాబాద్ జిల్లా నాయకులు సునీల్, చిరంజీవి, మీడియా ఇంచార్జి దూడ పాక నరేష్ పాల్గొన్నారు.


Next Story

Most Viewed