రూ.8500 కోట్ల ఫీజు రీయింబర్స్‌ మెంట్ వెంటనే చెల్లించాలి

by Elthuri vijay kumar |

విద్యార్థుల 8500 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం తక్షణం చెల్లించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు.

రూ.8500 కోట్ల ఫీజు రీయింబర్స్‌ మెంట్ వెంటనే చెల్లించాలి
X

రూ.8500 కోట్ల ఫీజు రీయింబర్స్‌ మెంట్ వెంటనే చెల్లించాలి

- లేకుంటే మంత్రులు, ఎమ్మెల్యేలను అడ్డుకుంటాం.. ప్రభుత్వాన్ని నిర్భందిస్తాం..

- 22 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో 20 రూపాయలు కూడా చెల్లించలేదు

- జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య

దిశ, కార్వాన్: విద్యార్థుల 8500 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం తక్షణం చెల్లించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. సోమవారం మాసబ్‌ట్యాంక్‌లో ఉన్నత విద్యా మండలి ముందు బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసనలో ఆయన పాల్గొన్నారు. వందలాది మంది విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ, ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 22 నెలలు గడిచినా ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని విమర్శించారు. కాంట్రాక్టర్లకు వేల కోట్లు కేటాయిస్తూనే విద్యార్థుల ఫీజులకు నిధులు లేవని చెప్పడం విద్యను నిర్లక్ష్యం చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. 8500 కోట్ల రూపాయలు చెల్లించకుంటే ఎమ్మెల్యేలు, మంత్రులను అడ్డుకునే దిశగా పోరాటం చేపడతామని, త్వరలో వారి అవినీతిని బయటపెడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ జాతీయ కన్వీనర్ బుజ్జ కృష్ణ, వేముల రామకృష్ణ, రాజేందర్ రామకోటి, అనంతయ్య, భాస్కర్ బలరాం తదితరులు పాల్గొన్నారు.

Next Story