- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, శేరిలింగంపల్లిః తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు నానా బీభత్సం చేశారు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తాళం వేసిన ఇండ్లను టార్గెట్ చేస్తూ గతంలో కూడా దొంగతనాలు చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌతమ్ నగర్ లో నివాసం ఉంటున్న బిహెచ్ఇఎల్ రిటైర్డ్ ఉద్యోగి వెంకటేశ్వరరావు తన కూతురును ఎయిర్ పోర్ట్ లో వదిలేందుకు ఆదివారం తెల్లవారుజామున వెళ్లారు. దాంతో దొంగలు తాళాలు పగలగొట్టి ఇంట్లో ఉన్న పది తులాల బంగారు ఆభరణాలతో పాటు కేజీ వెండి రూ.2 లక్షల 25 వేల నగదును చోరీ చేశారు. వారు ఎయిర్ పోర్ట్ నుంచి ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంటి తాళాలు పగలగొట్టి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Next Story






