నన్ను బెదిరిస్తోంది..! హీరో భార్యపై RJ శేఖర్ బాషా కంప్లైంట్

by Ramesh Naini |

ప్రముఖ టాలీవుడ్ హీరో ధర్మ మహేష్ భార్య గౌతమి చౌదరిపై బిగ్ బాస్ ఫేమ్, ఆర్‌జే శేఖర్ బాషా ఫిర్యాదు చేశారు.

నన్ను బెదిరిస్తోంది..! హీరో భార్యపై RJ శేఖర్ బాషా కంప్లైంట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ టాలీవుడ్ హీరో ధర్మ మహేష్ భార్య గౌతమి చౌదరిపై బిగ్ బాస్ ఫేమ్, ఆర్‌జే శేఖర్ బాషా ఫిర్యాదు చేశారు. గౌతమి చౌదరిత తనపై అనుచిత వ్యాఖ్య‌లు చేసిందని శేఖ‌ర్ బాషా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో BNS 351(3) 352 , 67 IT Act ప్రకారం గౌతమి చౌదరిపై కేసు నమోదు అయింది. ఈ సందర్భంగా ఆర్‌జే శేఖర్ బాషా మాట్లడుతూ.. హీరో ధర్మ మహేశ్‌కు సపోర్ట్‌గా మాట్లాడినందుకు గౌత‌మి చౌద‌రి తనను బెదిరించిందని ఆరోపించారు. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేశానని అన్నారు. తనపైనే కాకుండా తన తల్లి, కూతురుపై కూడా గౌతమి అభ్యంతకర వ్యాఖ్యలు చేసిందని శేఖర్ బాషా తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు వెల్లడించారు.

Next Story