- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాతబస్తీలో రివాల్వర్ కలకలం.. అసలేం జరిగిందంటే..?
అల్లుడికి ఇచ్చిన రూ. 8 లక్షలు వెంటనే తనకు ఇప్పించాలని లైసెన్సుడ్ రివాల్వర్ ను బయటికి తీసి మామను బెదిరించిన ఘటన మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం అర్ధరాత్రి తీవ్ర కలకలం రేపింది.

దిశ, చార్మినార్ : అల్లుడికి ఇచ్చిన రూ. 8 లక్షలు వెంటనే తనకు ఇప్పించాలని లైసెన్సుడ్ రివాల్వర్ ను బయటికి తీసి మామను బెదిరించిన ఘటన మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం అర్ధరాత్రి తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మీర్ చౌక్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నూర్ ఖాన్ బజారు కు చెందిన మీర్ ఇక్బాల్ (70) గత కొన్ని రోజుల క్రితం అదే ప్రాంతానికి చెందిన మొహమ్మద్ ఇంతియాస్ హుస్సేన్ (64) అల్లుడు షబ్బు ను చూసి అతని స్నేహితుడుకి రూ. 8 లక్షలు అప్పుగా ఇచ్చాడు. తీసుకున్న కొన్ని రోజులకే రూ. 8 లక్షలను షబ్బుకు ఇచ్చి ఇక్బాల్ కు ఇవ్వుమన్నాడు. ఇక్బాల్ కు షబ్బు డబ్బులు ఇవ్వకుండా అతను వాటిని వాడేసుకున్నాడు.
దీంతో ఇక్బాల్ పలు మార్లు అడిగినప్పటికి డబ్బులు ఇప్పుడు లేవని చెప్పసాగాడు. అయితే ఇక్బల్ నూర్ ఖాన్ బజార్ లోని మొహమ్మద్ ఇంతియాస్ సెల్ ఫోన్ దుకాణానికి మంగళవారం రాత్రి వెళ్ళాడు. అక్కడ మీ అల్లుడు షబ్బు డబ్బులు ఇచ్చేది ఉందని, చెప్పి డబ్బులు అన్న ఇప్పించాలని, లేక సెల్ ఫోన్ షాప్ ను అయినా తమకు అప్పగించాలని డిమాండ్ చేశాడు. దీంతో మొహమ్మద్ ఇంతియాస్, ఇక్బాల్ ల మధ్య మాట మాట పెరిగి గొడవ కు దారితీసింది. తన వద్ద ఉన్న లైసెన్స్ డ్ రివాల్వర్ ను బయటికి తీసి చేతి తో కొట్టాడు. అంతే గాకుండా చెప్పు తీసి కొట్ట బోయాడు. ఈ వీడియోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బాధితుడు మొహమ్మద్ ఇంతియాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మీర్ చౌక్ పోలీసులు కేసును నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.






