మాజీ మంత్రి మల్లారెడ్డికి బిగ్ షాక్.. భూ కబ్జాపై సర్వే

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-02-10 12:43:42  IST  )

మాజీ మంత్రి మల్లారెడ్డికి రెవెన్యూ అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు. ...

మాజీ మంత్రి మల్లారెడ్డికి బిగ్ షాక్.. భూ కబ్జాపై సర్వే
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి మల్లారెడ్డి(Former Minister Malla Reddy)కి రెవెన్యూ అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు. మేడ్చల్ జిల్లా(Medchal District)లో ఆయనకున్న యూనివర్సిటీ భూమిలో సర్వే(Survey) చేస్తున్నారు. 12 ఎకరాలు కబ్జా చేశారని మేడ్చల్ జిల్లా కోర్టు(Court)ను యాదగిరి, సత్తెమ్మ అనే వ్యక్తులు ఆశ్రయించారు. దీంతో వర్సిటీలో భూ సర్వే చేసి పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. ఈ ఆదేశాలతో సోమవారం స్థానిక రెవెన్యూ అధికారులు మల్లారెడ్డి యూనివర్సిటీకి వెళ్లారు. వర్సిటీలో ఉన్న 12 ఎకరాల్లో సర్వే చేపట్టారు. మల్లారెడ్డికి వర్సిటీలో ఎంత భూమి ఉంది. ఎన్ని ఎకరాలు కబ్బా చేశారనే అంశాలపై అధికారులు లెక్కలు బయటకు తీస్తున్నారు.

కాగా వేడుకల్లో పాటలు, డ్యాన్సులతో మస్తు సందడి చేసే మాజీ మంత్రి మల్లారెడ్డికి ఈ మధ్య టైమ్ సరిగా లేదు. ఆయన ఏది చేసినా వివాదమే అవుతోంది. బీఆర్‌ఎస్(Brs) హయాంలో మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగిపోయిన ఆయన రాజకీయం ప్రమాణం.. ప్రస్తుతం చిక్కుల్లో చిక్కుకుంటోంది. పాలనమ్మినా, పూలు అమ్మినా అని చెప్పుకునే మల్లారెడ్డికి ప్రైవేటు విద్యా సంస్థలు కూడా ఉన్నాయి. ఈ విద్యా సంస్థల నిర్మాణాలపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మల్లారెడ్డి అక్రమంగా ఆక్రమించి విద్యాసంస్థలను నిర్మించారని విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాదు పలువురు కోర్టులను కూడా ఆశ్రయిస్తున్నారు. తాజాగా మల్లారెడ్డిపై యాదగిరి, సత్తెమ్మ అనే వ్యక్తులు తీవ్ర ఆరోపణలు చేశారు. కాలేజీ కోసం భూములు కబ్జా చేశారని కోర్టుకు వెళ్లారు. దీంతో మరోసారి మల్లారెడ్డి చర్చల్లోకి ఎక్కారు. ప్రస్తుతం ఆయన యూనివర్సిటీ భూముల్లో రెవెన్యూ అధికారులు సర్వే చేస్తున్నారు. ఆ తర్వాత ఏం జరగుతుందో చూడాలి.

Next Story