Hyderabad : రేవతి, తన్వీ యాదవ్ లకు బెయిల్ మంజూరు

by Muthe.Rajitha |

సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నందుకు ఇద్దరు యూట్యూబ్ మహిళా జర్నలిస్టులు రేవతి, తన్వీ యాదవ్ లను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

Hyderabad : రేవతి, తన్వీ యాదవ్ లకు బెయిల్ మంజూరు
X

దిశ, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నందుకు ఇద్దరు యూట్యూబ్ మహిళా జర్నలిస్టులు రేవతి, తన్వీ యాదవ్ లను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా వీరి ఇరువురికి నేడు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ముఖ్యమంత్రిపై అసత్య ప్రచారం చేస్తు ట్రోలింగ్ చేస్తున్నట్లు అందిన ఫిర్యాదుపై వీరిని మార్చ్ 12న హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. కాగా ఈ కేసులో వీరు నాంపల్లి కోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా.. కోర్టు వీరికి బెయిల్ మంజూరు చేసింది. అయితే సీఎం రేవంత్ రెడ్డిని అభ్యంతకరంగా దూషిస్తూ, అవమానపరుస్తు మాట్లాడుతున్న వ్యక్తులను ఇంటర్వ్యూలను తీసుకుని, వాటిని ఉద్దేశ్య పూర్వకంగా జర్నలిస్ట్ రేవతి, తన్వీ యాదవ్ పల్స్ టీవీ, నిప్పుకోడి పేరుతో సోషల్ మీడియా వేదికగా వైరల్ చేస్తున్నారు. వీరి తీరుపై కాంగ్రెసు సోషల్ మీడియా సెల్ ప్రతినిధి కార్యదర్శి ఫిర్యాదు చేయగా.. సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని అదుపులోకి తీసుకున్నారు.

Next Story