- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘కేరళ పాలన’పై రేవంత్ వ్యాఖ్యలు సిగ్గుచేటు : మాజీ ఎమ్మెల్సీ చేరుపల్లి సీతారాములు
కేరళ ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని సీపీఎం మాజీ కేంద్ర కమిటీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు విమర్శించారు.

దిశ, వనస్థలిపురం : కేరళ ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని సీపీఎం మాజీ కేంద్ర కమిటీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు విమర్శించారు. శుక్రవారం మన్సూరాబాద్‌లోని తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో జాతీయ స్థాయిలో అవార్డులు పొందిన కేరళ ప్రభుత్వంపై విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. కేరళ సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని కమ్యూనిస్టు ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందని, అలాంటి ప్రభుత్వంపై విమర్శలు చేయడం తగదన్నారు. కేరళలో అమలవుతున్న విధానాలను తెలంగాణలో కూడా తీసుకువచ్చి ఆరు గ్యారంటీల అమలు తీరుపై చర్చించేందుకు సిద్ధమా అని రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు.
విద్య, వైద్యం, ఆరోగ్యం, సంక్షేమం, పంచాయతీరాజ్ రంగాల్లో కేరళ దేశానికి ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. కరోనా సమయంలో ప్రజలకు అండగా నిలిచినందుకే వామపక్షాలు మళ్లీ అధికారంలోకి వచ్చాయని గుర్తు చేశారు. గతంలో తెలంగాణ నాయకులు కేరళను సందర్శించి అక్కడి వైద్య విధానాలను అధ్యయనం చేసి బస్తీ దవాఖానాలు ప్రారంభించారని తెలిపారు. పినరయి విజయన్ అనుభవంతో పోలిస్తే రేవంత్ రెడ్డి రాజకీయ అనుభవం తక్కువేనని వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలైన మహిళలకు రూ.2500, వ్యవసాయ కూలీలకు రూ.1200, కల్యాణ లక్ష్మి కింద బంగారం, ఇతర పథకాలు అమలయ్యాయా అని ప్రశ్నించారు. ప్రభుత్వ విధానాలపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.






