- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలోని గుడిసెల తొలగింపు
మాదాపూర్ డివిజన్ ఖానామెట్ పరిధిలోని మేడికుంట చెరువు కబ్జాలను హైడ్రా అధికారులు మరోసారి తొలగించే పనిలో పడ్డారు .

దిశ, శేరిలింగంపల్లి : మాదాపూర్ డివిజన్ ఖానామెట్ పరిధిలోని మేడికుంట చెరువు కబ్జాలను హైడ్రా అధికారులు మరోసారి తొలగించే పనిలో పడ్డారు . మేడికుంట చెరువు ఎఫ్టీఎల్ లో ఉన్నదని గతంలో సినీహీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెషన్ ను కూల్చివేసిన అధికారులు అప్పుడు చెరువు చుట్టూ ఉన్న కబ్జాలకు కూడా తొలగించారు. అయితే కొందరు ఆ సమీపంలోనే గుడిసెలు వేసుకుని నివాసం ఉండడంతో హైడ్రా సూచనలతో చందానగర్ జీహెసీఎంసీ అధికారులు వారందరికి నోటీసులు జారీచేశారు. బుధవారం సాయంత్రం అక్కడికి చేరుకున్న జీహెసీఎంసీ అధికారుల సూచనల మేరకు అక్కడ నివాసం ఉంటున్న వారు తమ గుడిసెలను తొలగించారు. హైడ్రా, జీహెసీఎంసీ సిబ్బంది మేడికుంట చెరువు ఎఫ్టీఎల్ పరిధి చుట్టూ వేసిన షెడ్ లను, డంప్ యాడ్ లను తొలగించారు. ఆ పనులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. నగరంలో పలు చెరువులను మోడల్ చేరువులుగా తీర్చిదిద్దుతామని గతంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా మేడికుంటను కూడా అభివృద్ధి చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.






