చరిత్రను వక్రీకరిస్తున్న మతతత్వవాదులు

by Elthuri vijay kumar |

భూస్వామ్య వ్యతిరేకంగా జరిగిన పోరాటాన్ని హిందూ-ముస్లింల పోరాటంగా చిత్రీకరించి మతతత్వవాదులు చరిత్రను వక్రీకరిస్తున్నారని ప్రొఫెసర్ హరగోపాల్ విమర్శించారు

చరిత్రను వక్రీకరిస్తున్న మతతత్వవాదులు
X

చరిత్రను వక్రీకరిస్తున్న మతతత్వవాదులు

- భూస్వామ్య వ్యతిరేక పోరాటాన్ని హిందూ-ముస్లింల పోరాటంగా చిత్రీకరణ

- సమాజంలో అసమానతలు ఉన్నంత కాలం తిరుగుబాటు ఆగదు : ప్రొఫెసర్ హరగోపాల్

దిశ,సికింద్రాబాద్: భూస్వామ్య వ్యతిరేకంగా జరిగిన పోరాటాన్ని హిందూ-ముస్లింల పోరాటంగా చిత్రీకరించి మతతత్వవాదులు చరిత్రను వక్రీకరిస్తున్నారని ప్రొఫెసర్ హరగోపాల్ విమర్శించారు. సెప్టెంబర్ 17 వక్రీకరణ ససందర్భంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం- పునః సమీక్ష అనే అంశంపై ఏఐఎస్ఎఫ్ ఓయూ కౌన్సిల్ ఆధ్వర్యంలో మంగళవారం ఓయూ ఆర్ట్స్ కళాశాలలో సెమినార్ నిర్వహించారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా ప్రొఫెసర్ హరగోపాల్, వక్తలుగా సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, ప్రొఫెసర్ కందుకూరి రమేష్, వీక్షణం ఎడిటర్ ఎన్. వేణుగోపాల్, కాలమిస్ట్ డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్, ఆక్టివిస్ట్ అచ్యుత సునీత తదితరులు హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ.. సమాజంలో అసమానతలు ఉన్నంత కాలం తిరుగుబాటు ఆగదన్నారు. భూస్వామ్య రూపం మారిందని, సారం మాత్రం మారలేదని విమర్శించారు. మానవ సంబంధాలు విధ్వంసం అవుతుండడం ఆందోళనకరమన్నారు. అనంతరం పాశం యాదగిరి మాట్లాడుతూ.. హోం మంత్రి అమిత్ షాకు తెలంగాణ పోరాట చరిత్ర తెలియదన్నారు. వీక్షణం ఎడిటర్ ఎన్. వేణుగోపాల్ మాట్లాడుతూ.. భూస్వాములు, నిజాం అరాచకాల పైన బడుగువర్గాలు జరిపిన పోరాటం మరువలేనిదన్నారు. శ్రమ దోపిడీపైన అసమాన పోరాటం జరిపారని గుర్తు చేశారు. సంగిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ.. హైద్రాబాద్ పై నిష్పక్షపాతమైన చరిత్రను రాయాల్సి ఉందని, బందగీ చరిత్రను వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రొఫెసర్ కందుకూరి రమేష్ మాట్లాడుతూ.. మరుగున పడుతున్న చరిత్రను యువతకు అందించేందుకు ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం పునః సమీక్ష పేరిట సెమినార్ నిర్వహించడం అభినందనీయమన్నారు. ఆక్టివిస్ట్ అచ్యుత సునీత మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాటంలో మహిళల పాత్ర అత్యంత కీలకమని గుర్తు చేశారు. అనంతరం సంగిశెట్టి శ్రీనివాస్ రాసిన " సింగార వేలు " పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ట్స్ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ కొండా నాగేశ్వర్ రావు, ప్రొఫెసర్ ఆమంచి నాగేశ్వర్, ఏఐఎస్ఎఫ్ ఓయూ అధ్యక్ష, కార్యదర్శులు లెనిన్, నెల్లి సత్య, రైతు స్వరాజ నాయకులు కన్నెగంటి రవి, వివిధ విద్యార్థి సంఘాల నేతలు ఆర్ఎన్.శంకర్, కాంపల్లి శ్రీనివాస్,ఆర్ఎల్. మూర్తి, ఎస్. నాగేశ్వర్ రావు, బట్టు వెంకటేశ్వర్లు, తాళ్ల అజయ్, కలకోటి ఉదయ్, ఎన్ సుమంత్, నామ సైదులు, వేదాంత్, అశ్వన్, ఆన్సర్, రాకేష్, మొగిలిపాక నవీన్, పరిశోధక విద్యార్థులు సునీల్, చరణ్, వినోద్, దుబ్బ రంజిత్, బండి శ్రీనివాస్, కిరణ్, శ్రీనివాస్, నిఖిల్, వెంకటేష్, విద్యార్థులు సుశాంత్, నెల్లి శివ, జీల మహేష్, భాను, కార్తీక్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Next Story