విద్యార్థులకు రామకృష్ణ మఠం 'శ్రద్ధ' శిక్షణ

by velandi.Saikiran |   (  Updated:2026-04-02 05:53:35  IST  )

పదో తరగతి, ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థుల కోసం రామకృష్ణ మఠం ‘శ్రద్ధ’ పేరిట ప్రత్యేక వ్యక్తిత్వ వికాస శిబిరాన్ని నిర్వహిస్తోంది.

విద్యార్థులకు రామకృష్ణ మఠం శ్రద్ధ శిక్షణ
X

దిశ‌, హైదరాబాద్: పదో తరగతి, ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థుల కోసం రామకృష్ణ మఠం ‘శ్రద్ధ’ పేరిట ప్రత్యేక వ్యక్తిత్వ వికాస శిబిరాన్ని నిర్వహిస్తోంది. మఠంలోని వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 14 - 25 తేదీల్లో ఈ శిక్షణ ఉంటుంది.

రెండు వారాల పాటు జరిగే ఈ కార్యక్రమంలో స్వామీజీలు, రంగాల నిపుణులు విద్యార్థులకు దిశానిర్దేశం చేస్తారు. ఏకాగ్రత, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, యోగా, ధ్యానం, భారతీయ సంస్కృతి-విలువలపై ప్రత్యేక తరగతులు ఉంటాయి. శిబిరం వేళలు ఉదయం 9:30 - మధ్యాహ్నం 12:30 వరకు. ఆసక్తి గల వారు www.vihehyd.org/allcourses వెబ్‌సైట్‌లో లేదా 9177232696 నంబరు ద్వారా పేర్లు నమోదు చేసుకోవచ్చు.

Next Story