Ram Gopal Varma: ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదిపై RGV వివాదాస్పద వ్యాఖ్యలు.. పీఎస్‌లో ఫిర్యాదు

by samatah |   (  Updated:2022-06-24 09:15:23  IST  )

Ram Gopal Varma Controversial Comments On NDA's Presidential Candidate Draupadi Murmu| ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సినీ దర్శకులు రాంగోపాల్ వర్మపై బీజేపీ నాయకులు శుక్రవారం అబిడ్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

Ram Gopal Varma Controversial Comments On NDAs Presidential Candidate Draupadi Murmu
X

దిశ ప్రతినిధి , హైదరాబాద్ : Ram Gopal Varma Controversial Comments On NDA's Presidential Candidate Draupadi Murmu| ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సినీ దర్శకులు రాంగోపాల్ వర్మపై బీజేపీ నాయకులు శుక్రవారం అబిడ్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్, సీనియర్ బీజేపీ రాష్ట్ర నాయకులు గూడూరు నారాయణ రెడ్డి లు ఫిర్యాదు చేశారు. ఏన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థినిగా ద్రౌపది ముర్మును ప్రకటించిన సందర్భంగా 'ద్రౌపది రాష్ట్రపతి ' అయితే మరి కౌరవులు ఎవరంటూ కామెంట్ చేశారని, ఇవి ఆమె మనోభావాలు దెబ్బతినేలా ఉన్నందున ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని వారు తమ ఫిర్యాదులో కోరారు. రాంగోపాల్ వర్మపై బీజేపీ నాయకులు ఫిర్యాదు చేశారని, . అయితే లీగల్ ఒపీనియన్ తీసుకున్న అనంతరం కేసు నమోదు చేస్తామని అబిడ్స్ ఇన్ స్పెక్టర్ ప్రసాదరావు తెలిపారు.

Next Story