మంచి మనసు చాటుకున్న రాచకొండ సీపీ

by velandi.Saikiran |

మంచి మనసు చాటుకున్నారు రాచకొండ సీపీ సుధీర్ బాబు. గణేష్ నిమజ్జనం శోభయాత్రకు సంబంధించిన బందోబస్తు విధుల్లో బిజీ

మంచి మనసు చాటుకున్న రాచకొండ సీపీ
X

దిశ, సిటీక్రైం : మంచి మనసు చాటుకున్నారు రాచకొండ సీపీ సుధీర్ బాబు. గణేష్ నిమజ్జనం శోభయాత్రకు సంబంధించిన బందోబస్తు విధుల్లో బిజీ బిజీగా ఉన్న సమయంలో.. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ దంపతులకు ప్రధమ చికిత్సను అందించారు రాచకొండ పోలీసు కమిషనర్ సుధీర్ బాబు. ఈ సంఘటన శనివారం మల్లాపూర్ ఆర్ సీఐ రోడ్డులో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

గణేష్ నిమజ్జనం కార్యక్రమంలో భాగంగా పోలీసు కమిషనరేట్ పరిధిలో బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు రాచకొండ పోలీసు కమిషనర్ సుధీర్ బాబు. ఈ త‌రుణంలోనే... మల్లాపూర్ ఆర్ సీఐ రోడ్డు మార్గంలో దంపతులు బాలాపూర్ గణపతిని చూసేందుకు వెళ్తున్నారు. ఈ సంద‌ర్భంగా ద్విచక్రవాహనం అదుపు తప్పి కింద పడిపోయారు. దీంతో దంపతులకు గాయాలయ్యాయి. ఇది గమనించిన సీపీ సుధీర్ బాబు వారికి తన సిబ్బందితో కలిసి ప్రధమ చికిత్సను అందించారు. దీంతో సీపీ సుధీర్ బాబు చర్య పట్ల స్థానికుల నుంచి అభినందనలు వెల్లువెత్తున్నాయి.

Next Story