- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
HYDRA : కబ్జాలపై ఈ వాట్సాప్ నెంబరుకు సమాచారం ఇవ్వండి : హైడ్రా కమిషనర్

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్(Hyderabad)లో చెరువులు, నాలాల ఆక్రమణలను తొలగించి, నగరంలోని నీటి వనరులను రక్షించేందుకు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(HYDRA) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా నగరంలో ఎక్కడైనా నాలాలు, ప్రభుత్వ స్థలాలు, పార్కులు కబ్జాలకు గురైతే వాటి సమాచారం అందజేయాలని HYDRA కమిషనర్ ఏ.వీ. రంగనాథ్(AV Ranganath) ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నేరుగా హైడ్రా ఆఫీసుకు రాకుండానే వాటికి సంబంధించిన ఫొటోలు, లొకేషన్ వివరాలను వాట్సాప్ నంబర్ 8712406899కు పంపాలని కోరారు. కాగా నగరంలో గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ ద్వారా వరద నీటిని రోడ్లు, నివాస ప్రాంతాల్లోకి చేరకుండా నేరుగా చెరువుల్లోకి మళ్లించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
జూలై 19, 2024న హైడ్రా ఏర్పడినప్పటి నుంచి భారీగా ఆక్రమణలను తొలగించి, పదుల ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నామని ప్రకటించారు. హైదరాబాద్ నగరంలో 1979-2023 మధ్య 61% చెరువుల విస్తీర్ణం కోల్పోయామని, ప్రస్తుతం హైడ్రా చేపడుతున్న పునరుద్ధరణ చర్యలు చెరువులు , కుంటలు, జీవవైవిధ్య రక్షణ, వరద నివారణలో కీలక పాత్ర పోషిస్తాయని రంగనాథ్ వెల్లడించారు.






