- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిమ్స్ 19వ డైరెక్టర్‌గా ప్రొఫెసర్ డా. రాహుల్ దేవరాజ్ బాధ్యతల స్వీకరణ..
నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) 19వ డైరెక్టర్‌గా యూరాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ డా. రాహుల్ దేవరాజ్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు

దిశ, ఖైరతాబాద్ : నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) 19వ డైరెక్టర్‌గా యూరాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ డా. రాహుల్ దేవరాజ్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నిమ్స్ పూర్వ డైరెక్టర్ డా. నగరి బీరప్ప అధికారికంగా బాధ్యతలను డా. రాహుల్ దేవరాజ్ కి అప్పగించారు. బాధ్యతల స్వీకరణ అనంతరం డా. రాహుల్ దేవరాజ్ మాట్లాడుతూ.. నిమ్స్‌ను వైద్య సేవలు, వైద్య విద్య, పరిశోధన రంగాల్లో మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని తెలిపారు. రోగులకు అత్యాధునిక, నాణ్యమైన, అందుబాటులో ఉండే వైద్య సేవలను అందించడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా డా. నగరి బీరప్ప గారు మాట్లాడుతూ.. నిమ్స్ అభివృద్ధి కోసం సంస్థ సిబ్బంది, అధ్యాపకులు, వైద్యులు అందించిన సహకారం మరువలేనిదని తెలిపారు. నూతన డైరెక్టర్ డా. రాహుల్ దేవరాజ్ నాయకత్వంలో నిమ్స్ మరిన్ని విజయాలు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ రిజిస్ట్రార్ శాంతి వీర్, పరిపాలన విభాగం హెచ్.ఓ. డి డా.లక్ష్మీ భాస్కర్, అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ డా.కృష్ణ రెడ్డి, డా. అమరేశ్వర్, డా. రామ్మూర్తి మరియు సిబ్బంది పాల్గొని నూతన డైరెక్టర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.






