తిరుపతి జిల్లాకు సీఎం, గవర్నర్... అధికారులకు కీలక ఆదేశాలు

by Vemula.Srinu Prasad |

ఈ నెల 9న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు. అటు గవర్నర్ అబ్దుల్ నజీర్ సైతం మూడు రోజులపాటు జిల్లాలో పర్యటించనున్నారు...

తిరుపతి జిల్లాకు సీఎం, గవర్నర్... అధికారులకు కీలక ఆదేశాలు
X

దిశ, తిరుపతి ప్రతినిధి: ఈ నెల 9న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు. అటు గవర్నర్ అబ్దుల్ నజీర్ సైతం మూడు రోజులపాటు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ స్పష్టం చేశారు. ఆదివారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన ముందస్తు భద్రతా శ్రేణి లైజన్ (ఎ.ఎస్.ఎల్) అధికారుల సమన్వయ సమావేశంలో జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు జాయింట్ కలెక్టర్ ఆర్. గోవింద రావులతో కలిసి సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ప్రముఖులు పర్యటించనునుండటంతో ముందస్తు ఏర్పాట్లపై సంబంధిత అధికారులకు దిశా నిర్దేశం చేశారు.


Next Story