- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
HYDERABAD : ప్రిజం పబ్ కాల్పుల్లో కీలక నిజాలు
హైదరాబాద్(Hyderabad) లో గచ్చిబౌలిలోని ప్రిజం పబ్(Gachibouli Prism Pub)లో శనివారం ఓ నేరస్తుడు పోలీసుల మీదకి కాల్పులు(Firing) జరిపిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్(Hyderabad) లో గచ్చిబౌలిలోని ప్రిజం పబ్(Gachibouli Prism Pub)లో శనివారం ఓ నేరస్తుడు పోలీసుల మీదకి కాల్పులు(Firing) జరిపిన విషయం తెలిసిందే. బత్తుల ప్రభాకర్ అనే పాత నేరస్తుడిపై వందకు పైగా కేసులు ఉన్నాయి. పబ్ లో ఉన్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు.. పట్టుకునేందుకు అక్కడికి చేరుకోగా.. వారిని చూడగానే ప్రభాకర్ భయంతో వారిపైకి కాల్పులు జరిపాడు. అందులో ఒక బుల్లెట్ కానిస్టేబుల్ వెంకట్ రామ్ రెడ్డి ఎడమ పాదంలోకి దూసుకుపోయింది. మరో బౌన్సర్ కు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన కానిస్టేబుల్, బౌన్సర్‌ను కాంటినెంటల్ హాస్పిటల్స్‌కు తరలించి, చికిత్స అందిస్తున్నారు. ఇతర బౌన్సర్ల సహాయంతో పారిపోతున్న నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని, పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం కాల్పుల ఘటనపై కేసు నమోదు చేశారు.
గాయపడిన కానిస్టేబుల్‌ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మొహంతి(Cyberabad Police Commissionor Avinash Mahanthi) ఆసుపత్రిలో పరామర్శించారు. కాగా గచ్చిబౌలి లాంటి రద్దీ ఏరియాలో కాల్పులు జరగడంతో ఒక్కసారిగా జనం ఉలిక్కి పడ్డారు. పబ్ కి వచ్చిన వారంతా ప్రాణభయంతో పరుగులు తీశారు. ఒక్కసారిగా అక్కడి వాతావరణం సినిమాలోని సీన్ లాగ మారిపోయింది. నేరస్తుడి వెంట పోలీసులు పరుగులు తీయడం సినిమా ఛేజింగ్ సన్నివేశాన్ని తలపించింది. కాగా ఈ కేసులో నిందితుడి నుంచి పోలీసులు అనేక మారణాయుధాలు స్వాధీనం చేసుకొని.. వాటి గురించి ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా అతని నుంచి స్వాధీనం చేసుకున్న 3 తుపాకులు.. బీహార్ గ్యాంగ్ నుంచి కొనుగోలు చేసినట్టు తేల్చారు. అయితే ప్రభాకర్ వెనుక ఏవైనా బీహార్ గ్యాంగ్స్ ఉన్నాయా అని విచారిస్తున్నారు. కేసు దర్యాప్తు జరుగుతున్న కొద్దీ మరిన్ని విషయాలు తెలియనున్నాయి.






