ప్రభుత్వ ఆసుపత్రులలో మౌలికవస్తుల కల్పనకై ప్రణాళికలు సిద్ధం చేయండి : కలెక్టర్ హరిచందన

by Chintha Aamani |

వైద్య రంగానికి ప్రభుత్వం అతంత్య ప్రాధాన్య‌త ఇస్తోందని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి అన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రులలో మౌలికవస్తుల కల్పనకై ప్రణాళికలు సిద్ధం చేయండి : కలెక్టర్ హరిచందన
X

దిశ,హైదరాబాద్ బ్యూరో : వైద్య రంగానికి ప్రభుత్వం అతంత్య ప్రాధాన్య‌త ఇస్తోందని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి అన్నారు. సోమ‌వారం క‌లెక్ట‌రేట్ స‌మావేశ మందిరంలో ఉస్మానియా, గాంధీ ఆసుప‌త్రుల వైద్య అధికారుల‌తో ఆసుప‌త్రుల‌లో క‌ల్సిస్తున్న వ‌స‌తులపై మెడిక‌ల్ కాలేజీల‌ మానిట‌రింగ్ క‌మీటి స‌మీక్షా సమావేశం జిల్లా క‌లెక్ట‌ర్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణలో అతిపెద్ద ఆసుపత్రులైన గాంధీ, ఉస్మానియా లలో వైద్య పరికరాలతో పాటు, మౌలిక వసతులు కల్పనకై ప్రణాళికలు సిద్ధం చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఆసుప‌త్రుల‌లో నెలకొన్న స‌మ‌స్య‌లు, వైద్య సిబ్బంది కొర‌త వంటి అంశాల‌పై చ‌ర్చించారు. డాక్ట‌ర్లు, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్లు, బోధ‌న‌, బోధ‌నేత‌ర సిబ్బంది, ఔట్ సోర్సింగ్‌, కాంట్రాక్ట్ ప‌ద్ద‌తిన పని చేసే సిబ్బంది నియ‌మాకం గురించి అడిగి తెలుసుకున్నారు.

మెడిక‌ల్ కాలేజీలలో మానిట‌రింగ్ క‌మిటిని ఏర్పాటు చేయాల‌ని సూచించారు. గాంధీ ఆసుప‌త్రిలో నీటి స‌మ‌స్య‌లు ఉన్న‌ట్లు క‌లెక్ట‌ర్ దృష్టికి డాక్ట‌ర్లు తీసుకురాగా నీటి స‌మ‌స్య‌ను సత్వరమే ప‌రిష్క‌రించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, చేప‌ట్టాల్సిన మ‌ర‌మ్మ‌తుల‌ను వేంట‌నే చేప‌ట్టాల‌ని సంబంధిత అధికారులకు సూచించారు. మెడిక‌ల్ కాలేజీలో టీచింగ్ సిబ్బంది కొత‌ర ఉన్నందున భ‌ర్తీ ప్ర‌క్రియ‌పై చ‌ర్చించారు. ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ పాతిప‌దికన టీచింగ్ స్టాప్, నాన్ టీచింగ్, శానిటేష‌న్ సిబ్బంది ఔట్ సోర్సింగ్ సిబ్బంది భ‌ర్తికీ ప్ర‌భుత్వ నిబంద‌న ప్ర‌కారం చర్యలు తీసుకోవాలన్నారు . ఈ స‌మాశంలో అద‌న‌పు క‌లెక్ట‌ర్ ముకుంద రెడ్డి, ఇంచార్జీ డీఆర్ ఓ డి. శ్రీ‌ధ‌ర్‌, ఆర్ డిఓ లు రామ‌కృష్ట‌, సాయిరామ్‌,డీఎంహెచ్ఓ డాక్టర్ వెంక‌టి, అద‌న‌పు డీయంఈ డాక్టర్ వాణి, గాంధీ ఆససుప‌త్రి ప‌ర్య‌వేక్షకులు రాకేష్ , ఉస్మానియా, గాంధీ మెడికల్ కాలేజ్ ల ప్రిన్సిపల్స్ డాక్టర్ కె ఇందిర , డాక్టర్ రాజారావు, గాంధీ, డాక్టర్ రాజ్‌కుమార్‌, డాక్ట‌ర్లు శేషాద్రి, డాక్టర్ బి. సునీతాబాయి, డాక్టర్ జ‌య‌కృష్షా తదితరులు పాల్గోన్నారు.

Next Story