- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అత్యాచారం కేసు: వినుకొండ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన సీఐ చినమల్లయ్య
అత్యాచారం కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టివేయబడటంతో, గత ఏప్రిల్ 29 నుంచి అజ్ఞాతంలో ఉన్న సీఐ చినమల్లయ్య ఇవాళ తెల్లవారుజామున వినుకొండ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు.

దిశ, వెబ్ డెస్క్: ఓ మహిళపై అత్యాచారానికి చేశాడనే ఆరోపణల సస్పెండైన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) చినమల్లయ్య (Chinamallaiah) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తనపై నమోదైన కేసును కొట్టి వేయాలని కోర్టును ఆశ్రయించిన చిన మల్లయ్యకు షాక్ తగిలింది. దీంతో గత కొద్ది రోజులుగా పరారీలో ఉన్న ఆయన ఎట్టకేలకు పోలీసులకు లొంగిపోయారు. ఇవాళ (శనివారం) తెల్లవారుజామున వినూత్న పరిణామాల మధ్య వినుకొండ పోలీస్ స్టేషన్‌కు వచ్చి స్వయంగా లొంగిపోయినట్లు తెలుస్తుంది. చినమల్లయ్య తనపై అత్యాచారం చేశాడని ఒక బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వినుకొండ పోలీసులు ఈ ఏడాది ఏప్రిల్ 29న ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. కేసు నమోదైన విషయం తెలుసుకున్నప్పటి నుంచి సీఐ చినమల్లయ్య పోలీసులకు దొరకకుండా అజ్ఞాతంలోకి వెళ్లారు.
అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు ఆయన తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఇందులో భాగంగానే ముందుగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టును, ఆ తర్వాత దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ (Anticipatory Bail) కోసం పిటిషన్లు దాఖలు చేశారు. అయితే ఆయనపై ఉన్న ఆరోపణల తీవ్రతను పరిశీలించిన హైకోర్టు, సుప్రీంకోర్టులు చినమల్లయ్య ముందస్తు బెయిల్ పిటిషన్లను పూర్తిగా కొట్టివేశాయి. న్యాయస్థానాలలో కూడా చుక్కెదురు కావడంతో అరెస్ట్ తప్పదని భావించిన చినమల్లయ్య, ఇవాళ తెల్లవారుజామున వినుకొండ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని తదుపరి చట్టపరమైన చర్యలు, కోర్టులో ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.






