TODAY’S HOROSCOPE: ఈ రోజు (06-06-2026)రాశిఫలాలు

by Kodari Anjali |

జూన్ 6 వ తేదీన రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పడు తెలుసుకుందాం..

TODAY’S HOROSCOPE: ఈ రోజు (06-06-2026)రాశిఫలాలు
X

మేషరాశి: అనారోగ్యం కారణంగా మూడ్ ఆఫ్ గా ఉంటారు. అధికంగా డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసేందుకు ఇష్టపడుతారు. ఖాళీ సమయంలో మొక్కలు నాటుతారు. వైవాహిక జీవితం అంతా బాగుంటుంది. మనోదైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించడం అవసరం.

వృషభ రాశి: గెట్ టు గెదర్ పార్టీలు చేసుకుంటారు. ఇవి మిమ్మల్ని రిలాక్స్ అయ్యేందుకు తోడ్పడుతుంది. విదేశాలకు వెళ్లేందుకు మంచి రోజు. ఆర్థికంగా అంతా బాగుంటుంది. ఎక్కువగా సాంగ్స్ వింటారు. ఇంటికి దూరపు చుట్టాలు వస్తారు. కుటుంబీకులతో గడుపుతారు. భాగస్వామితో భవిష్యత్తు గురించి ప్లాన్స్ వేస్తారు.

మిథున రాశి: ఆర్థికంగా పుంజుకుంటారు. యోగా చేయడం మేలు. ఆఫీసులో ప్రశంసలు అందుకుంటారు. నూతన కార్యాలు వాయిదా వేసుకోక తప్పదు. అనుకోకుండా కుటుంబంలో కలహాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. పార్క్ కు వెళ్తారు. మీ భాగస్వామితో ఎక్కువగా సమయం గడుపుతారు.

కర్కాటక రాశి: మీ జీవితంలో అద్భుతమైన వ్యక్తుల్ని కలుస్తారు. మీ మాటలు ఇతరులు బాధపెడుతాయి. కాగా కాస్త జాగ్రత్తగా మాట్లాడండి. దీర్ఘకాలికవ్యాధుల నుంచి విముక్తి పొందుతారు. మీ భాగస్వామితో ఎక్కువ సమయం గడుపుతారు.

సింహ రాశి: ఎక్కువ స్థాయి వ్యక్తుల నుంచి కొంత వ్యతిరేకత అనేది ఉంటుంది. అయినప్పటికీ మీరు ప్రశాంతంగా ఉండటం చాలా ముఖ్యం. ఎక్కువగా నిద్రపోతారు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి వృత్తి, ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. ఆత్మీయులను కలవడంలో విఫలమవుతారు. అనవసర వ్యయప్రయాసల వల్ల ఆందోళన చెందుతారు.

కన్యా రాశి: ఆర్థిక పరిస్థితులు మిమ్మల్ని నిరాశకు గురి చేస్తాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేయవద్దు. ఆకస్మిక ధనలాభంతో రుణ బాధలు తొలగిపోతాయి. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవడానికి కృషి చేస్తారు. స్త్రీలు, బంధు, మిత్రులను కలుస్తారు.

తులా రాశి: వృథా ఖర్చులు మానుకుంటారు. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు అవలీలగా అధిగమిస్తారు. కుటుంబ విషయాల్లో అనాసక్తితో ఉంటారు. స్త్రీలు విశ్రాంతి తీసుకోవడం అవసరం. తోటివారితో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. వ్యాపార మూలకంగా ధన నష్టం కలిగే అవకాశాలున్నాయి.

వృశ్చిక రాశి: జీవితంలో కఠిన పరిస్థితుల నుంచి బయటపడుతారు. ఖర్చులు కూడా తగ్గుతాయి. సన్నిహితుల నుంచి ఆర్థిక లబ్ది ఉండవచ్చు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.విదేశయాన ప్రయత్నం సులభమవుతుంది. కుటుంబ కలహాలకు తావీయరాదు. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంది.

ధనుస్సు రాశి: ఆర్థికంగా కాస్త ఇబ్బందులు ఎదుర్కుంటారు. పార్క్ కు వెళ్లి ఒంటరిగా గడిపేందుకు ఇష్టపడుతారు. ఎక్కువగా పాటలు వింటారు. మీ భాగస్వామితో నేడు అన్ని విషయాలు పంచుకునేందుకు ఆసక్తి చూపుతారు. డబ్బు పరంగా కాస్త జాగ్రత్తగా వహించడం మంచిది. ఏ పని అయినా ప్రారంభించేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి.

మకర రాశి: ఇవాళ రోజంగా హ్యాపీగా గడిపేస్తారు. మనీ ఎంత పొదుపు చేయాలి అనుకున్న.. ఆ ఆలోచనలు మాత్రం ముందుకు సాగవు. ప్రముఖ వ్యక్తులను కలుస్తారు. వారి సలహా, సూచనలు తీసుకుంటారు. ఆకస్మికంగా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. భాగస్వామిని బాగా డిస్టర్బ్ చేస్తారు.

కుంభ రాశి: పని ఒత్తిడి కారణంగా కాస్త టెన్షన్ కు గురి అవుతారు. ఫ్రెండ్స్, కుటుంబీకులతో ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తారు. ఆఫీసులో నిత్యం మీపై ఈర్ష్యతో ఉండే వ్యక్తులు ఇవాళ మీపై ప్రేమను కురిపిస్తూ చక్కగా మాట్లాడుతారు. ఎక్కువగా బుక్స్ చదువుతారు. భాగస్వామితో బయటకు వెళ్తారు. ఆర్థికంగా కాస్త వెనకబడుతారు.

మీన రాశి: క్రీడల్లో పాల్గొనడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతారు. సాయంత్రం బయటకు వెళ్తారు. ఒకే ఉద్యోగంలో కొనసాగడం మేలు. అనవసరపు ఖర్చులు ఏంటో ఇవాళ తెలుసుకుంటారు. నేడు మీ భాగస్వామితో అన్ని విషయాలు షేర్ చేసుకుంటారు.

Next Story