'ఎల్లమ్మ' మ్యూజిక్‌పై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన దేవి శ్రీ ప్రసాద్

by Pulgam srinivas |

‘ఎల్లమ్మ’ సినిమాకు సంబంధించిన కొన్ని పాటలతో పాటు ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌కు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా కంప్లీట్ చేసినట్లు దేవి శ్రీ ప్రసాద్ వెల్లడించాడు.

ఎల్లమ్మ మ్యూజిక్‌పై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన దేవి శ్రీ ప్రసాద్
X

దిశ, వెబ్ డెస్క్: రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్, దర్శకుడు బలగం వేణు కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ‘ఎల్లమ్మ’ చిత్రంపై ఇప్పటికే మంచి ఆసక్తి నెలకొన్న విషయం తెలిసిందే. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించనున్నారు. అయితే ఈ మూవీ అనౌన్స్‌మెంట్ వచ్చి చాలా కాలం గడిచినా ఇప్పటివరకు రెగ్యులర్ షూటింగ్ మాత్రం ప్రారంభం కాలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దేవి శ్రీ ప్రసాద్, ‘ఎల్లమ్మ’ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

ఆయన మాట్లాడుతూ.. ఈ చిత్రానికి సంబంధించిన పలు పనులు ఇప్పటికే పూర్తయ్యాయని తెలిపారు. కొన్ని పాటలు కూడా కంప్లీట్ చేశానని, ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌కు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను కూడా సిద్ధం చేశానని చెప్పారు. మ్యూజిక్, నటన విషయంలో పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని వెల్లడించారు. అలాగే నిర్మాత దిల్ రాజు, సినిమా ప్రారంభానికి ముందే నెలలో కేవలం 10 రోజులు మాత్రమే ‘ఎల్లమ్మ’ చిత్రానికి కేటాయించాలని సూచించారని, ఆ ప్లానింగ్ తనకు బాగా నచ్చిందని దేవి శ్రీ ప్రసాద్ తెలిపారు. ప్రస్తుతం సినిమా కథ గురించి ఎక్కువ వివరాలు చెప్పలేనప్పటికీ, ఇది గ్రామీణ నేపథ్యంలో సాగే కథ అని ఆయన వెల్లడించారు.

Next Story