ఓయూలో విద్యార్థి సంఘ నాయకుల ముందస్తు అరెస్ట్

by Naveena |

ఓయూలో జారీ చేసిన సర్క్యులర్ ను వెనక్కి తీసుకోవాలని విద్యార్థి నాయకులు ఆందోళనలు చేస్తున్నా నేపథ్యంలో పలువురు విద్యార్థి సంఘం నాయకులను ఓయూ పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఓయూలో విద్యార్థి సంఘ నాయకుల ముందస్తు అరెస్ట్
X

దిశ, సికింద్రాబాద్: ఓయూలో జారీ చేసిన సర్క్యులర్ ను వెనక్కి తీసుకోవాలని విద్యార్థి నాయకులు ఆందోళనలు చేస్తున్నా నేపథ్యంలో పలువురు విద్యార్థి సంఘం నాయకులను ఓయూ పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. బుధవారం ఓయూ సైన్స్ కళాశాలలో నిర్వహించిన ఓ సెమినార్ కు రాష్ట్ర గవర్నర్ హాజరు అయ్యారు. దీనిని దృష్టిలో ఉంచుకొని విద్యార్థి నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థి నాయకులు మాట్లాడుతూ.. యూనివర్సిటీ జారీచేసిన సర్క్యులర్ ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సర్క్యూలర్ ను వెనక్కి తీసుకోవాలని శాంతియుతంగా తెలుపుతున్న తమను అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. హాస్టల్లో, లైబ్రరీలో చదువుకుంటున్న తమను అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.

అరెస్టులతో పోరాటాలను ఆపలేరని హెచ్చరించారు. రాష్ట్ర గవర్నర్ పర్యటన దృష్ట్యా పోలీసులు విద్యార్థి నాయకుల హాస్టల్ గదిలోకి చొరబడి అరెస్టులు చేయడం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రజా ప్రభుత్వం అని చెప్తూ... ప్రజా పాలనలో, ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఏడో గ్యారెంటీ అని చెప్పిన విషయం గుర్తు చేసుకోవాలని అన్నారు. ఓయూను పోలీసు రక్యాంపుగా మార్చి, విద్యార్థుల స్వేచ్ఛ, హక్కులను కాల రాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్క్యూలర్ ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నప్పటికీ ఓయూ వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్ స్పందించకపోవడం సిగ్గుచేటని పేర్కొన్నారు. మా బాధలను గవర్నర్ (ఛాన్సలర్) కు విన్నవించుకోవడానికి కూడా అనుమతి ఇవ్వకుండా ముందస్తు అరెస్టు చేయడం దుర్మార్గమని తెలిపారు.

Next Story