- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, వెబ్ డెస్క్ : రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘ది రాజాసాబ్’ సినిమా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు ఏపీలో ప్రీమియర్ షోలకు అనుమతి ఇచ్చినప్పటికీ తెలంగాణలో ఇంతవరకూ ఎటూ తేల్చలేదు. కానీ హైదరాబాద్‌లోని బాలానగర్ ప్రాంతంలో ఉన్న విమల్ థియేటర్ లో మీడియా సభ్యుల కోసం మాత్రమే ఓ ప్రీమియర్ షో వేస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. దీంతో వందలాది ప్రభాస్ అభిమానులు థియేటర్ వద్దకు చేరుకోవడంతో, గందరగోళం నెలకొంది. తమకు కూడా స్పెషల్ లేదా పెయిడ్ ప్రీమియర్ షోలు వేయాలని అభిమానులు డిమాండ్ చేశారు.
అయితే తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ షోలు, టికెట్ ధరల పెంపుకు అనుమతి ఇవ్వకపోవడంతో థియేటర్లలో ప్రీమియర్ షో వేయలేమని థియేటర్ యాజమాన్యం చెప్పినప్పటికీ.. ప్రభాస్ అభిమానులు బాహుబలి జయహో అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ హంగామా సృష్టించారు. అంతేకాదు వందలాది మంది ఒక్కసారిగా థియేటర్లోకి దూసుకు వెళ్లి, షో వేసేవరకు కదిలేది లేదని సీట్లలో భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో మీడియా సభ్యులకు వేయాల్సిన ప్రత్యేక షో కూడా ఆగిపోయింది.
కొద్దిసేపు థియేటర్ పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు రంగంలోకి దిగి, అభిమానులను శాంతిపజేసే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు రేపటి నుంచి సాధారణ ధరలకే టికెట్ల బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. వీడియో






